రెండు శాంసంగ్ ఫోన్ల ధరలు తగ్గాయి, ఫీచర్లు, తగ్గిన ధరల వివరాలు ఇవే !

Written By:

శాంసంగ్ ఇండియాలో తన గెలాక్సీ ధరలను తగ్గించింది. గెలాక్సీ జే2 ప్రొ, గెలాక్సీ జే2(2017) స్మార్ట్‌ఫోన్ల ధరలను భారత్‌లో తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ-కామర్స్‌ సైట్లు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లలో ఇప్పటివరకు దీని ధరలు రూ.9,890, రూ.7,390గా ఉన్నాయి. తగ్గింపు అనంతరం గెలాక్సీ జే2 ప్రొ 7,690 రూపాయలకు, గెలాక్సీ జే2(2017) 6,590 రూపాయలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త ధరలు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రిటైలర్స్‌లో అన్నింటిలో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. అయితే తగ్గిన ధరలు ఈ-కామర్స్‌ సైట్లు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లలో ఇంకా లిస్ట్‌ కాలేదు.

ఐఫోన్లకు ఊరట, తెలుగు అక్షరం రహస్యాన్ని చేధించిన ఆపిల్, ఏం చేయాలంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్‌ గెలాక్సీ జే2 ప్రొ స్పెషిఫికేషన్లు

ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో
5 అంగుళాల హెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
1.5 గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌
2జీబీ ర్యామ్‌
8 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
16జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌
128జీబీ వరకు విస్తరణ మెమరీ
2600 ఎంఏహెచ్‌ బ్యాటరీ

గెలాక్సీ జే2(2017) స్పెషిఫికేషన్లు

ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌
4.7 అంగుళాల క్యూహెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ఎక్సీనోస్‌ ప్రాసెసర్‌
1జీబీ ర్యామ్‌, 8జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌
128జీబీ వరకు విస్తరణ మెమరీ
5 ఎంపీ రియర్‌ కెమెరా
2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
2000ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఈ స్మార్ట్‌ఫోన్లకు పోటీనిచ్చే ఇతర కంపెనీల ఫోన్లు ఇవే..

షియోమి రెడ్‌మి వై1 లైట్
అమెజాన్లో దీని ధర రూ. 6999
Redmi Y1 ప్రత్యేకతలు
మెటల్ యునిబాడీ డిజైన్, 5.5 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం, MIUI 8 కస్టమైజిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4Ghz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి,64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3080mAh బ్యాటరీ.

రెడ్‌మి 5ఏ

షియోమి రెడ్‌మి 5ఎ
3జిబి ర్యామ్ ధర రూ. 6990,
2జిబి ర్యామ్ ధర రూ. 4,990
షియోమి రెడ్‌మి 5ఎ ఫీచర్లు
5-inch 720p IPS LCD display 2/3 జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 128 జిబి విస్తరణ సామర్ధ్యం, 13 ఎంపీ కెమెరా, 1080 ఫిక్సల్ తో వీడియో షూట్ సామర్ధ్యం 5 ఎంపీ సెల్ఫీ షూటర్ Android Nougat-based MIUI 9 3,000mAh battery dual-SIM phone supports 4G LTE, VoLTE and USB OTG.

మిజు ఎమ్5

ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 7,390
ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0 ఎల్‌ఈ 3070 ఎంఏహెచ్ బ్యాటరీ

మోటో సీ ప్లస్

ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 6,990
మోటో సీ ప్లస్‌ ఫీచర్లు
5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే,1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 720 x 1280 పిక్స‌ల్స్‌ రిజ‌ల్యూష‌న్‌, ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్ 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, 128 జీబీ వరకు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా,2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

మోటో ఈ4

ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 7,390
మోటో ఈ4 ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

పానాసోనిక్ ఎలూగా ఐ5

ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.6,490
పానాసోనిక్ఎలూగా ఐ5 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆసాహి డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy J2 Pro and Galaxy J2 (2017) smartphones price slashed in India More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot