సామ్‌సంగ్ గెలాక్సీ జే3 ప్రో ఇప్పుడు ధర రూ.7,990కే

ఏప్రిల్‌లో మార్కెట్లో లాంచ్ అయి పేటీఎమ్ మాల్‌కు మాత్రమే పరిమితమైన సామ్‌సంగ్ గెలాక్సీ జే3 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా దొరుకుతోంది. ధర రూ.7,990. పేటీఎమ్ యాప్‌లో ఈ ఫోన్ ధర రూ.8,490గా ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ జే3 ప్రో టెక్నికల్ స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల హైడెఫినిషన్ సూప్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్

1.5GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా, బ్యాటరీ..

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్,4G LTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, ఎన్ఎఫ్‌సీ, మైక్రో యూఎస్బీ పోర్ట్, 2600 mAh బ్యాటరీ, ఫోన్ బరువు 138 గ్రాములు.

ఎస్ బైక్ మోడ్‌తో..

గెలాక్సీ జే3 ప్రో ఎస్ బైక్ మోడ్‌తో వస్తోంది. స్మార్ట్‌ఫోన్‌‌లో ఈ మోడ్‌‌ను ఎనేబుల్ చేసి బైక్ నడుపుతున్నప్పుడు మనకు ఏదైనా కాల్ వచ్చినట్లయితే, మన స్మార్ట్‌ఫోన్ ఆటోమెటిక్‌గా కాల్ చేసిన వారికి తర్వాత కాల్ చేయండి అనే మెసేజ్‌ను పంపుతుంది. దీంతో రైడర్స్ మాటిమాటికీ తమ మొబైల్ చూసుకోకుండా డ్రైవింగ్‌పైనే దృష్టి సారించవచ్చు. అదే ఎమర్జెన్సీ అయితే కాల్ చేసిన వారు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఒకటి అంకెను ప్రెస్ చేసినట్లయితే అర్జెంట్ కాల్ అని డ్రైవింగ్ చేస్తున్న వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు బండిని పక్కగా పార్క్ చేసి కాల్ రిసీవ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Samsung Galaxy J3 Pro is now available on Flipkart at Rs.7,990. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting