సామ్‌సంగ్ గెలాక్సీ జే5(2016) పై రూ.2,000 తగ్గింపు

సామ్‌సంగ్ లేటెస్ట్‌గా లాంచ్ చేసిన 2016 వర్షన్ గెలాక్సీ జే5 తాజాగా రూ.2000 ధర తగ్గింపును అందుకుంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.13,990గా ఉంది. తాజా ధర తగ్గింపులో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart రూ.11,990కే గెలాక్సీ జే5 ఫోన్‌ను విక్రయిస్తోంది.

Read More : 2016.. ఈ 10 ఫోన్‌లదే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్..

ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా కండీషన్‌లో ఉన్న మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను గెలాక్సీ జే5తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ కండీషన్‌ను బట్టి రూ.11,000 వరకు ఎక్స్‌ఛేంజ్ లభించే అవకాశం ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు అదనంగా 5 శాతం వరకు రాయితీని ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

5.2 అంగుళాల 1280 x 720 పిక్సల్ సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.2 గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 చిప్ సెట్, 2జీబి ర్యామ్,

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ప్రత్యేక ఫీచర్లు..

అల్ట్రా డేటా సేవింగ్ మోడ్, ఎస్-బైక్ మోడ్, మై గెలాక్సీ యాప్ వంటి ప్రత్యేక ఫీచర్లను సామ్‌సంగ్ ఈ ఫోన్‌లో పొందుపరిచింది. మెటల్ ఫ్రేమ్ ఇంకా మోస్ట్ స్టైలిష్ డిజైన్స్‌తో వస్తోన్న ఈ ఫోన్‌ మొదటి చూపులోనే మిమ్మల్ని మెప్పిస్తుంది.

సామ్‌సంగ్ ఎస్ బైక్ మోడ్ అంటే..?

స్మార్ట్‌ఫోన్‌‌లో ఈ మోడ్‌‌ను ఎనేబుల్ చేసి బైక్ నడుపుతున్నప్పుడు మనకు ఏదైనా కాల్ వచ్చినట్లయితే, మన స్మార్ట్‌ఫోన్ ఆటోమెటిక్‌గా కాల్ చేసిన వారికి తర్వాత కాల్ చేయండి అనే మెసేజ్‌ను పంపుతుంది. దీంతో రైడర్స్ మాటిమాటికీ తమ మొబైల్ చూసుకోకుండా డ్రైవింగ్‌పైనే దృష్టి సారించవచ్చు. అదే ఎమర్జెన్సీ అయితే కాల్ చేసిన వారు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఒకటి అంకెను ప్రెస్ చేసినట్లయితే అర్జెంట్ కాల్ అని డ్రైవింగ్ చేస్తున్న వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు బండిని పక్కాగా పార్క్ చేసి కాల్ రిసీవ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy J5 (2016) gets a price cut, now available at Rs 11,990. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot