మార్కెట్లోకి గెలాక్సీ జే5, జే7, అర్థరాత్రి నుంచి అమ్మకాలు

Written By:

సామ్‌సంగ్ తన 2016 వర్షన్ గెలాక్సీ జే5, జే7 స్మార్ట్‌ఫోన్‌లను సోమవారం మార్కెట్లో లాంచ్ చేసింది. జే5 ధర రూ.15,990, జే7 ధర రూ.13,999. ఈ రోజు అర్థరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి.

సరికొత్త లుక్‌తో గెలాక్సీ జే5, జే7

సామ్‌సంగ్ ఇండియా, ఈ ఫోన్‌ల కొనుగోలు పై 30 జీబి ఉచిత డేటాను ఎయిర్‌టెల్ యూజర్లకు ఆఫర్ చేస్తోంది. అల్ట్రా డేటా సేవింగ్ మోడ్, ఎస్-బైక్ మోడ్, మై గెలాక్సీ యాప్ వంటి ప్రత్యేక ఫీచర్లను సామ్‌సంగ్ ఈ ఫోన్‌లలో పొందుపరిచింది. మెటల్ ఫ్రేమ్ ఇంకా మోస్ట్ స్టైలిష్ డిజైన్స్‌తో వస్తోన్న ఈ రెండు ఫోన్‌లకు స్పెసిఫికేషన్‌లను ఇప్పుడు చూద్దాం...

Read More : అంగారకుడి పై డేంజర్ బెల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సరికొత్త లుక్‌తో గెలాక్సీ జే5, జే7

5.2 అంగుళాల 720 పిక్సల్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.2 గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 410 చిప్ సెట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016 వర్షన్) స్పెసిఫికేషన్స్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 (2016 వర్షన్) స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 (2016 వర్షన్) స్పెసిఫికేషన్స్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy J5 and J7 in India: All You Need to Know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot