ఆ సామ్‌సంగ్ ఫోన్‌లు ఇప్పుడు 32జీబి స్టోరేజ్ వేరియంట్‌లో దొరుకుతున్నాయ్

క్రిందటి సంవత్సరం మార్కెట్లో లాంచ్ అయి హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన గెలాక్సీ జే5 ప్రైమ్, గెలాక్సీ జే7 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు 32జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో లభ్యమవుతున్నాయి. గతంలో ఇవి 16జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేవి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తాజా ధరలు..

తాజాగా లాంచ్ అయిన 32జీబి వేరియంట్ గెలాక్సీ జే7 ప్రైమ్ ధర రూ.16,900. 32జీబి వేరియంట్ గెలాక్సీ జే5 ప్రైమ్ ధర రూ.14,900.

ఎక్కడ దొరుకుతాయ్...

ఈ 32జీబి వేరియంట్ ఫోన్‌లను సామ్‌సంగ్ ఇండియా అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు థర్డ్ పార్టీ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా సొంతం చేసుకోవచ్చు.

Galaxy J7 Prime స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1920x 1080పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్,

Galaxy J7 Prime స్పెసిఫికేషన్స్..

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300 mAh బ్యాటరీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

Galaxy J5 Prime స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,400 mAh బ్యాటరీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy J5 Prime, J7 Prime 32GB variants launched in India; price starts from Rs.14,900. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot