సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌ల పై ధర తగ్గించారు
విడుదల సమయంలో రూ.15,990గా ఉన్న ఈ ఫోన్, తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.14,990కే ట్రేడ్ అవుతోంది.
గతేడాది మార్కెట్లో లాంచ్ అయిన సామ్‌సంగ్ గెలాక్సీ జే7(2016) స్మార్ట్‌ఫోన్ పై Snapdeal రూ.1000 తగ్గింపును ప్రకటించింది. విడుదల సమయంలో రూ.15,990గా ఉన్న ఈ ఫోన్, తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.14,990కే స్నాప్‌డీల్ వద్ద ట్రేడ్ అవుతోంది. గోల్డ్, వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
Read More : 2,50,000 ప్రభుత్వ ఉద్యోగులకు రోబోట్లు ఎసరు

సామ్‌సంగ్ గెలాక్సీ జే7(2016) స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.6GHzఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016 ఎడిషన్) పై రూ.2,000 తగ్గింపు
గెలాక్సీ జే7 (2016 ఎడిషన్)తో పాటుగా మార్కెట్లో లాంచ్ అయిన గెలాక్సీ జే5 (2016 ఎడిషన్) పై Flipkart రూ.2,000 ధర తగ్గింపును ప్రకటించింది. విడుదల సమయంలో రూ.13,990గా ఉన్న ఈ ఫోన్, తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.11,990కే ఫ్లిప్‌కార్ట్ వద్ద ట్రేడ్ అవుతోంది.

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్
5.2 అంగుళాల 720 పిక్సల్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.2GHz క్వాడ్ కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 305 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ కనెక్టువిటీ, 3100 mAh బ్యాటరీ. అల్ట్రా డేటా సేవింగ్ మోడ్, ఎస్-బైక్ మోడ్, మై గెలాక్సీ యాప్ వంటి ప్రత్యేక ఫీచర్లను సామ్‌సంగ్ ఈ ఫోన్‌లలో పొందుపరిచింది.

సామ్‌సంగ్ ఎస్ బైక్ మోడ్ అంటే..?
సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ మోడ్‌ను ఎనేబుల్ చేసి బైక్ నడుపుతున్నప్పుడు మనకు ఏదైనా కాల్ వచ్చినట్లయితే, మన స్మార్ట్‌ఫోన్ ఆటోమెటిక్‌గా కాల్ చేసిన వారికి తర్వాత కాల్ చేయండి అనే మెసేజ్‌ను పంపుతుంది. దీంతో రైడర్స్ మాటిమాటికీ తమ మొబైల్ చూసుకోకుండా డ్రైవింగ్‌పైనే దృష్టి సారించవచ్చు. అదే ఎమర్జెన్సీ అయితే కాల్ చేసిన వారు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఒకటి అంకెను ప్రెస్ చేసినట్లయితే అర్జెంట్ కాల్ అని డ్రైవింగ్ చేస్తున్న వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు బండిని పక్కాగా పార్క్ చేసి కాల్ రిసీవ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications