ఫోన్ల పేలుడుతో శాంసంగ్ కుదేల్, మళ్లీ ఇంకోటి..
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ వరుస మొబైల్ పేళుళ్లతో కుదేలవుతోంది. ఆ కంపెనీకి స్మార్ట్‌ఫోన్ పేలుడు కష్టాలు ఇప్పట్లో వీడే సూచనలు కనపడ్డం లేదు.
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ వరుస మొబైల్ పేళుళ్లతో కుదేలవుతోంది. ఆ కంపెనీకి స్మార్ట్‌ఫోన్ పేలుడు కష్టాలు ఇప్పట్లో వీడే సూచనలు కనపడ్డం లేదు. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుడుతో తీవ్ర నష్టాలను మూటగట్టుకున్న కంపెనీ, దాన్నుంచి బయటపడే సమయంలో మళ్లీ శాంసంగ్ గెలాక్సీ జె7 ఝలక్ ఇచ్చింది. ఏకంగా విమానంలోనే ఈ ఫోన్ బ్లాస్ట్ అయినట్లు తెలుస్తోంది. వివరాల్లోకెళితే..

విమానం బయలుదేరిన 15 నిమిషాలకే..
హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఢిల్లీనుంచి ఇండోర్‌కు బయలుదేరిన జెట్ ఎయిర్‌వేస్ విమానంలో శాంసంగ్ గెలాక్సీ జె 7 పేలిపోయింది. 120 మంది ప్రయాణీకులతో విమానం బయలుదేరిన 15 నిమిషాలకే ఈ పేలుడు సంభవించింది.

అకస్మాత్తుగా మంటలంటుకొని..
ఒక ప్రయాణికురాలి హ్యాండ్‌బ్యాగులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా అకస్మాత్తుగా మంటలంటుకొని, పొగలు వ్యాపించడంతో ప్రయాణీకులు భయాందోళనలకు లోనయ్యారు. అయితే సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మరింత సమాచారం కోసం..
శాంసంగ్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ ప్రమాదంపై శాంసంగ్ ఇండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ మరింత సమాచారం కోసం సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామనీ, కస్టమర్ భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యత అని ప్రకటించారు.

నీళ్లు చల్లి మంటల్ని అదుపు చేయడం ..
మరోవైపు విమానంలో ఉన్న అగ్నిమాపక పరికరం చేయకపోవడంతో.. నీళ్లు చల్లి మంటల్ని అదుపు చేయడం మరో వివాదానికి దారి తీసింది. అటు డీజీసీఎస్ మార్గదర్శకాలన్నింటినీ తాము పాటిస్తున్నామని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.

శాంసంగ్ నోట్ 7 పేలుళ్లతో..
కాగా గత ఏడాది శాంసంగ్ నోట్ 7 పేలుళ్లతో కంపెనీ తీవ్ర నష్టాలను మూటగట్టుకుంది.

శాంసంగ్ ఎస్ 8, గెలాక్సీ్ నోట్ 8
ఈ క్రమంలో చాలా గ్యాప్ తరువాత ఇటీవల శాంసంగ్ ఎస్ 8, గెలాక్సీ నోట్ 8 ను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ విమానంలో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ పేలడం కలకలం రేపింది.


Click it and Unblock the Notifications








