ఫస్ట్ టైం డ్యూయెల్ కెమెరాతో గెలాక్సీ జె7 Duo,బడ్జెట్ ధరతో నేటి నుంచి అమ్మకాలు

|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియాలో తన జె సీరిస్ లో సరికొత్త డ్యూయెల్ కెమెరా స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. కాగా జె సీరిస్ లో ఫస్ట్ టైం డ్యూయెల్ కెమెరాతో వస్తున్న ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది. Samsung Galaxy J7 Duo పేరుతో వచ్చిన ఈ ఫోన్ నేటి నుంచి అమ్మకానికి రానుంది. అన్ని శాంసంగ్ ప్రధాన స్టోర్లతో పాటు ఈ కామర్స్ సైట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. కాగా ఇందులో శాంసంగ్ కొత్త ఫీచర్లను పొందుపరిచింది. గతంలో వచ్చిన గెలాక్సీ జె7 ఫోన్ కి మరిన్ని హంగులను అద్దుతూ ఈ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది.

 
ఫస్ట్ టైం డ్యూయెల్ కెమెరాతో గెలాక్సీ జె7 Duo,బడ్జెట్ ధరతో నేటి నుంచే..

ఇందులో 5.5 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. వీటితో తీసుకునే ఫొటోలను బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లర్ చేసుకోవచ్చు. ఇక ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం కల్పించారు. డిస్‌ప్లే కింద ఉన్న హోమ్ బటన్‌లోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు, డ్యుయల్ సిమ్‌ల కోసం 3 స్లాట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. రూ.16,990 ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది.

ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఈ రోజే లాస్ట్ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఈ రోజే లాస్ట్

శాంసంగ్ గెలాక్సీ జె7 డ్యుయో ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

కాగా ఈ కంపెనీ Mobile Business senior vice president Mohandeep Singh మాట్లాడుతూ ఇండియాలో యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ ఫోన్ ని తీసుకువచ్చామని వారి జీవితాల్లో ఈ ఫోన్ సరికొత్త వెలుగులు తీసుకురానుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బడ్జెట్ రేంజులో వచ్చిన ఈ ఫోన్ ఫీచర్లు మరే ఇతర ఫోన్లలో లేవని.ఇతర ఫోన్లకు ముఖ్యంగా షియోమి బడ్జెట్ ఫోన్లకు ఈ ఫోన్ గట్టి పోటినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy J7 Duo launches in India with Dual Cameras and Android Oreo More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X