శాంసంగ్ నుంచి సైలెంట్‌గా దూసుకొచ్చిన గెలాక్సీ జే7 ప్రైమ్ 2
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ సైలెంట్ గా తన కొత్త ఫోన్ గెలాక్సీ జే7 ప్రైమ్ 2ని ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది.
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ సైలెంట్ గా తన కొత్త ఫోన్ గెలాక్సీ జే7 ప్రైమ్ 2ని ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. గతేడాది లాంచ్ చేసిన గెలాక్సీ జే7 ప్రైమ్ సక్సెస్ అయిన నేపథ్యంలో దానికి సక్ససర్‌గా గెలాక్సీ జే7 ప్రైమ్ 2ని తీసుకొచ్చింది. కాగా ఈ ఫోన్ కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్టు అయిన నిమిషాల్లోనే సోల్ట్ అవుట్ అయినట్లు తెలుస్తోంది. కాగా అందులో నోటీఫై ఆప్సన్ కనిపిస్తోంది. కొత్త గెలాక్సీ జే7 ప్రైమ్ 2 స్మార్ట్‌ఫోన్ అప్‌డేటెడ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను, 13 ఎంపీ ఫ్రంట్ అదేవిధంగా రియర్ షూటర్‌ను, లైవ్ స్టికర్స్, లైవ్ ఫిల్డర్స్ వంటి సోషల్ ఫీచర్లను కలిగి ఉంది. మాల్ అనే శాంసంగ్ ఆల్-ఇన్-వన్ షాపింగ్ సర్వీసును ఇది కలిగి ఉంది. శాంసంగ్ పే మినీని కూడా ఇది సపోర్టు చేస్తోంది. కాగా ఈ ఫోన్ రీటెయిల్ షాపుల్లో కాని, ఆన్ లైన్ మార్కెట్లో కాని ఎక్కడా లభ్యం అవడం లేదు. కేవలం శాంసంగ్ వెబ్‌సైట్‌లో మాత్రమే కనిపిస్తోంది. ఆసక్తి ఉన్న వారు సైట్లోకెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్ 2 ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ టీఈటీ డిస్‌ప్లే
కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్
మెటల్ యూనిబాడీ డిజైన్
1.6గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ఎక్సీనోస్ 7 సిరీస్ ప్రాసెసర్
3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
3300 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
ఆండ్రాయిడ్ నోగట్, 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీ ఆప్షన్


Click it and Unblock the Notifications








