కొత్త ఫీచర్లతో సామ్‌సంగ్ ఫోన్‌లు Galaxy J7 Pro, Galaxy J7 Max
ఈ రెండు ఫోన్‌లలో ‘Pay Mini' పేరుతో సరికొత్త పేమెంట్ ఫీచర్‌ను సామ్‌సంగ్ పొందుపరిచింది.
Galaxy J7 Pro, Galaxy J7 Max పేర్లతో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను సామ్‌సంగ్ ఇండియా బుధవారం లాంచ్ చేసింది. గెలాక్సీ జే ప్రో 7 ధర రూ.20,990. గెలాక్సీ జే7 మాక్స్ ధర రూ.17,900. గెలాక్సీ జే7 మాక్స్ అమ్మకాలు జూన్ 20 నుంచి ప్రారంభమవుతాయి. ఇదే గెలాక్సీ జే7 ప్రో అమ్మకాలు జూలై మూడవ వారం నుంచి ప్రారంభమవుతాయి.

లాంచ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి...
ఈ రెండు ఫోన్‌లలో ‘Pay Mini' పేరుతో సరికొత్త పేమెంట్ ఫీచర్‌ను సామ్‌సంగ్ పొందుపరిచింది. ఈ ఫోన్‌లను కొనుగోలు చేసే యూజర్లకు లాంచ్ ఆఫర్ క్రింద 120జీబి ఎక్స్‌ట్రా జియో 4జీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా Pay Mini యాప్ ద్వారా డబ్బు చెల్లించినట్లయితే రూ.800 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Pay Mini యాప్ గురించి క్లుప్తంగా...
Pay Mini యాప్‌ను Samsung Pay యాప్‌కు లైటర్ వర్షన్‌గా భావించవచ్చు. సామ్ సంగ్ పే యాప్ కేవలం హై-ఎండ్ సామ్‌సంగ్ ఫోన్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇదే సమయంలో Pay Mini యాప్ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపై వర్షన్ పై రన్ అయ్యే అన్ని సామ్ సంగ్ ఫోన్ లను సపోర్ట్ చేస్తుంది. MST టెక్నాలజీ పై రన్ అయ్యే స్వైపింగ్ మెచీన్ లను Pay Mini యాప్ సపోర్ట్ చేయదు.

Galaxy J7 Pro స్పెసిఫికేషన్స్....
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే విత్ 1080 పిక్సల్ రిసల్యూషన్, సామ్‌సంగ్ ఎక్సినోస్ 7870 సాక్, 3జీబి, 64జీబి స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,600mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 7.0 నౌగల్ ఆపరేటింగ్ సిస్టం విత్ సామ్‌సంగ్ కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, మైక్రో యూఎస్బీ పోర్ట్.

Galaxy J7 Max స్పెసిఫికేషన్స్...
5.7 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే విత్ ఫుల్ హైడెఫినిషన్ 1080పిక్సల్ రిసల్యూషన్, మీడియాటెక్ హీలియో పీ20 ఆక్టా కోర్ సాక్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,300mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 7.0 నౌగల్ ఆపరేటింగ్ సిస్టం విత్ సామ్‌సంగ్ కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, మైక్రో యూఎస్బీ పోర్ట్.


Click it and Unblock the Notifications