Home
Mobile

ఇండియాలో దుమ్మురేపిన శాంసంగ్

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సామ్‌సంగ్, భారత్‌లో మరోమారు తన సత్తాను చాటుకుంటోంది.

By Bommu Sivanjaneyulu

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సామ్‌సంగ్, భారత్‌లో మరోమారు తన సత్తాను చాటుకుంటోంది. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన గెలాక్సీ జే6, గెలాక్సీ జే8 స్మార్ట్‌ఫోన్‌లు అమ్మకాల సునామీని సృష్టిస్తున్నాయి. వీటిలో మొదటి మోడల్ అయిన గెలాక్సీ జే6 2018, మే 22న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. మరో మోడల్ అయిన గెలాక్సీ జే8 2018, జూన్ 28న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది.

రోజుకు 50,000 మంది యూజర్లు..

రోజుకు 50,000 మంది యూజర్లు..

మార్కెట్లో లాంచ్ అయిన నాటి నుంచి ఈ రెండు ఫోన్‌లను 20 లక్షల పై చిలుకు యూజర్లు కొనుగోలు చేసినట్లు సామ్‌సంగ్ ఇండియా వెల్లడించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు రోజుకు 50,000 మంది యూజర్లు ఆకర్షిస్తన్నట్లు సామ్‌సంగ్ తెలిపింది. 2018 రెండవ త్రైమాసికిగానికిగాను భారత్‌లో 9.9 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించినట్లు సామ్‌సంగ్ తెలిపింది.

చాట్-ఓవర్-వీడియో ఫీచర్..

చాట్-ఓవర్-వీడియో ఫీచర్..

గెలాక్సీ జే8, జే6 స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లో విజయం సాధించటం మాకు చాలా ఆనందంగా ఉందని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ ప్రొడక్ట్స్‌ను అందించటమే తమ అంతిమ లక్ష్యమని సామ్‌సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అసీమ్ వార్సీ తెలిపారు. సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేలతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లకు చాట్-ఓవర్-వీడియో ఫీచర్ ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. మార్కెట్లో గెలాక్సీ జే8 ధర రూ.18,990గా ఉంది. మరో మోడల్ అయిన గెలాక్సీ జే6 (64జీబి, 32జీబి) వేరియంట్స్ ధరలు రూ.15,990, రూ.13,990లుగా ఉన్నాయి.

 సిగ్నేచర్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే...

సిగ్నేచర్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే...

సామ్‌సంగ్ సిగ్నేచర్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేలతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు 15 శాతం అదనపు డిస్‌ప్లే ఏరియాతో మరింత బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను రెట్టింపు చేస్తాయి. గెలాక్సీ జే8 డివైస్‌లో నిక్షిప్తం చేసిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ హైక్వాలిటీ ఫీచర్లతో కనువిందు చేస్తోంది. లైవ్ ఫోకస్, పోర్ట్రెయిట్ డాలీ, పోర్ట్రయిట్ బ్యాక్ డ్రాప్, బ్యాగ్రౌండ్ బ్లూ, షేప్ వంటి స్పెషల్ ఫీచర్స్ ఈ కెమేరాలో ఉన్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ జే8 స్పెసిఫికేషన్స్..

సామ్‌సంగ్ గెలాక్సీ జే8 స్పెసిఫికేషన్స్..

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 40 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,500 mAh బ్యాటరీ. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

సామ్‌సంగ్ గెలాక్సీ జే6 స్పెసిఫికేషన్స్

సామ్‌సంగ్ గెలాక్సీ జే6 స్పెసిఫికేషన్స్

5.6 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+ జీఎస్ఎమ్), 3000mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ, ఫోన్ బరువు 154 గ్రాములు.

Best Mobiles in India

English summary
Samsung India has sold over 2 million units of its recently-launched Galaxy J8 and Galaxy J6 mid-segment smartphones in India, attracting nearly 50,000 consumers a day, the company said on Monday. The Samsung Galaxy J6 was launched on May 22, while Galaxy J8 was introduced on June 28.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X