20.7 మెగా పిక్సల్ కెమెరాతో సామ్‌సంగ్ గెలాక్సీ కే జూమ్

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో సంచలనాల దిశగా దూసుకువెళుతున్న సామ్‌సంగ్ తాజాగా ‘గెలాక్సీ కే జూమ్' ( Galaxy K Zoom) పేరుతో సరికొత్త కెమెరా ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం సింగపూర్‌లో ఆవిష్కరించింది. గెలాక్సీ ఎస్4 జూమ్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా రాబోతున్న ఈ డివైస్ 20.7 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటుంది. పలు ఆన్‌లైన్ నివేదికల ద్వారా అందుతోన్న సమాచారం మేరకు గెలాక్సీ కే జూమ్‌ను మే 2014 నుంచి అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించునున్నట్లు తెలుస్తోంది. ఆవిష్కరణ సందర్భంగా సామ్‌సంగ్ ఈ డివైస్ ధర అలానే అందుబాటుకు సంబంధించి ఏ విధమైన సమాచారాన్ని వెల్లడించలేదు.

సామ్‌సంగ్ గెలాక్సీ కే జూమ్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

4.8 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (హైడెఫినిషన్ రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
హెక్సా-కోర్ (1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ + 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్) ఎక్సినోస్ (5260) ప్రాసెసర్,
మాలీ-టీ624 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
సామ్‌సంగ్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్,
20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (జినాన్ ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్, ఓఐఎస్,10ఎక్స్ ఆప్టికల్ జూమ్),
ఈ కెమెరా ద్వారా 1080పిక్సల్ క్వాలిటీతో కూడిన వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
సెల్పీ అలారమ్, ఆబ్జెక్ట్ ట్రేసింగ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
4జీ ఎల్టీఈ/3జీ హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై 802.11ఏ/బీ/జీ/ఎన్/ఏసీ,
వై-ఫై డైరెక్ట్, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ వీ4.0ఎల్ఈ, ఏజీపీఎస్+గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
2430ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు (అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్, ఎస్ హెల్త్‌లైఫ్, స్టూడియో యాప్).

ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో గెలాక్సీ కే జూమ్.. సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్, నోకియా లూమియా 1520 వంటి కెమెరా ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల నుంచి పోటీని ఎదుర్కొవల్సి ఉంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X