Home
Mobile

శాశ్వతంగా ధర తగ్గింపును అందుకున్న Samsung Galaxy M01

ఇండియాలోని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లలో శామ్‌సంగ్ సంస్థకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ బ్యాండ్ 10వేల లోపు ధరలో తక్కువ సంఖ్యలో మాత్రమే స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తుంది. అటువంటిది జూన్ నెలలో ఈ ధర విభాగంలో విడుదల చేసిన గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ మీద సంస్థ ఇప్పుడు శాశ్వతంగా ధరను తగ్గించింది. తగ్గింపు ధర వద్ద గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ ను ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ M01 తగ్గింపు ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M01 తగ్గింపు ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో జూన్ నెలలో 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్ లో రూ.8,999 ధర వద్ద విడుదల అయింది. అయితే సంస్థ ఇప్పుడు దీనిని రూ.8,399 ధరకు తగ్గించింది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ మరియు రెడ్ వంటి మూడు కలర్ ఎంపికలలో పొందవచ్చు.  

శామ్సంగ్ గెలాక్సీ M01 5.7-అంగుళాల HD + డిస్ప్లే

శామ్సంగ్ గెలాక్సీ M01 5.7-అంగుళాల HD + డిస్ప్లే

శామ్సంగ్ గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ 5.7-అంగుళాల HD + డిస్ప్లేను 720 x 1280 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంటుంది. ఇది 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P22 SoC ద్వారా రన్ అవుతుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్‌ సాయంతో మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ M01 డ్యూయల్ కెమెరా సెటప్

శామ్సంగ్ గెలాక్సీ M01 డ్యూయల్ కెమెరా సెటప్

శామ్సంగ్ గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజింగ్ విషయానికి వస్తే దీని యొక్క వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో మెయిన్ కెమెరా f / 2.48 ఎపర్చర్‌తో 13MP లెన్స్ కెమెరా మరియు దీనితో పాటు f /1.8 ఎపర్చర్‌తో 2MP సెకండరీ లెన్స్ కెమెరాలు కలిగి ఉంటాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో f / 2.48 ఎపర్చర్‌తో 5MP సెల్ఫీ కెమెరా అమర్చబడి ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ M01 డాల్బీ అట్మోస్ టెక్నాలజీ ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ M01 డాల్బీ అట్మోస్ టెక్నాలజీ ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మోస్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది వినియోగదారుకు సరౌండ్ సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. దానితో పాటు ఇది మీ ఆరోగ్య స్థాయిలను పర్యవేక్షించడానికి శామ్‌సంగ్ హెల్త్ యాప్ ముందే ఇన్‌స్టాల్  చేయబడి ఉంది.  అదనపు భద్రత కోసం వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. అలాగే స్మార్ట్‌ఫోన్ అన్‌లాకింగ్ అనుభవాన్ని శీఘ్రంగా మరియు యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి సామ్‌సంగ్ సాఫ్ట్‌వేర్‌లో ఫేస్ రికగ్నిషన్‌ను జోడించింది. ఇది 4,000mAh బ్యాటరీని కలిగి ఉండి 168 గ్రాముల బరువుతో వస్తుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M01 Smartphone Price Dropped Permanently in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X