ధర రూ.7999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్.. అమెజాన్‌లో సేల్..!
శాంసంగ్ ఇటీవల ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. గత వారమే శాంసంగ్ గెలాక్సీ A06 హ్యాండ్‌సెట్ విడుదల చేయగా.. తాజాగా శాంసంగ్ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy M05 Smartphone Launched) లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్‌లోనే అందుబాటులోకి వచ్చింది. ఈ శాంసంగ్ కొత్త హ్యాండ్‌సెట్ 50MP కెమెరా సహా 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే ఎంట్రీ లెవల్ ధరలో విడుదల అయినా గానీ మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
శాంసంగ్ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 720*1600 పిక్సల్ రిజల్యూషన్, 60Hz రీఫ్రెష్ రేట్‌తో విడుదల అయింది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది.

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్ హీలియో G85 12nm ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. 4GB LPDDR4x ర్యామ్ మరియు 64GB eMMC 5.1 స్టోరేజీతో జతచేయబడుతుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ రెండు OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను పొందనున్నాయి.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్ 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు LED ఫ్లాష్ లైట్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.0 అపేచర్‌తో 8MP కెమెరాను కలిగి ఉంది. దీంతో తక్కువ ధరలోనే నాణ్యమైన కెమెరాలు అందించినట్లు అయింది.
4GB ర్యామ్ + 64GB స్టోరేజీతో :
ఈ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 5.3. GPS, USB-C ఛార్జింగ్ పోర్టు. 3.5mm ఆడియో జాక్‌తో అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M05 ధర, సేల్ వివరాలు :
ఈ శాంసంగ్ గెలాక్సీ M05 స్మా్ర్ట్‌ఫోన్ 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.7999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ మరియు ఇతర రిటైల్ స్టోర్‌ల కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మింట్ గ్రీన్ రంగులో లభిస్తుంది.
గత వారం శాంసంగ్ గెలాక్సీ A06 స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. 6.7 అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 OS ను కలిగి ఉంది. మీడియాటెక్ హీలియో G85 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. A06 స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది. 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 64GB హ్యాండ్‌సెట్ ధర రూ.9999 గా ఉంది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ లైట్ బ్లూ, బ్లాక్, గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








