Home
Mobile

రూ.10 వేల కంటే తక్కువ ధరలో 50MP కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో స్మార్ట్‌ఫోన్.. కీలక వివరాలు లీక్‌!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్‌ ఈ సంవత్సరంలో అనేక ఎంట్రీ, బడ్జెట్‌ సెగ్మెంట్‌ మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఇందులో M సిరీస్, F సిరీస్‌, A సిరీస్‌ ఫోన్‌లు ఉన్నాయి. అయితే త్వరలో శాంసంగ్‌ నుంచి ఎంట్రీ లెవల్‌ ధర సెగ్మెంట్‌లో మరో హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలు లీక్‌ అయ్యాయి.

భారత్ మార్కెట్‌లో ఈ సంవత్సరం మార్చిలో శాంసంగ్‌ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ M07 4G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy M07 4G Smartphone) త్వరలో లాంచ్‌ అ‌య్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ వివరాల లీక్‌ అయ్యాయి.

Samsung Galaxy M07 4G smartphone

డిస్‌ప్లే అంచనా వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ M07 4G స్మార్ట్‌ఫోన్‌ వివరాలు Smartprix ద్వారా అందుబాటులోకి వచ్చాయి. దీని ఆధారంగా గెలాక్సీ M07 4G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 720 x 1600 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 260ppi పిక్సల్‌ డెన్సిటీతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS! :
దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో G99 చిప్‌సెట్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్ 4GB ర్యామ్, 64GB స్టోరేజీతో జతచేసి ఉండే అవకాశం ఉంది. శాంసంగ్‌ అప్‌కమింగ్‌ ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేసే అవకాశం ఉంది.

50MP కెమెరా! :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు రెండు కెమెరాలతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ లెన్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ కెమెరాలతో 1080p వీడియో రికార్డింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్! :
శాంసంగ్‌ గెలాక్సీ M07 4G స్మార్ట్‌ఫోన్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ ధర రూ.8 వేల నుంచి రూ.9 వేల మధ్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మార్చి నెలలో లాంచ్‌ అయిన M06 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.9499 గా ఉంది.

ఈ ఫోన్‌ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ పొందుతుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.

మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ఎప్పుడు కచ్చితంగా విడుదల అయ్యే అవకాశం ఉందనే వివరాలు తెలియలేదు. అయితే ఈ ఫోన్‌ గురించి శాంసంగ్‌ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M07 4G smartphone specifications and features tipped online
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X