Just In
- 22 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- Movies
బ్రేకింగ్: ప్రముఖ నటి జమున కన్నుమూత.. దిగ్బ్రాంతిలో సినీ పరిశ్రమ!
- News
సమయం లేదు మిత్రమా.. బీజేపీలో ఈటల రాజేందర్ కు పెద్ద కష్టమే!!
- Sports
INDvsNZ : తొలి టీ20 పిచ్ రిపోర్ట్.. టీమిండియా మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Finance
world richest: ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీళ్లే.. మరి అంబానీ, అదానీల స్థానమెంతో తెలుసా ?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Samsung Galaxy M13 సిరీస్ ధరలు లీక్.. ఓ లుక్కేయండి!
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం భారత మార్కెట్లో Samsung Galaxy M13 series విడుదలకు సర్వం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా Samsung కంపెనీ Galaxy M13 4G, Galaxy M13 5G రెండు మొబైల్స్‌ను విడుదల చేయనుంది. విడుదలకు ఒక రోజు ముందు ఆయా డివైజ్‌లకు సంబంధించిన ధరలు లీకయ్యాయి. ఇప్పుడు ఆ మొబైల్స్ కు సంబంధించి లీకైన ధరలు ఇతరత్రా విశేషాలు కూడా తెలుసుకుందాం.

Samsung Galaxy M13 series లీక్‌డ్ ధరలు:
ఆన్‌లైన్ పలు టెక్ వర్గాల నుంచి లీకైన వివరాల ప్రకారం.. Samsung Galaxy M13 4G మోడల్ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్లలో లభించనుంది. 4GB+64GB వేరియంట్ ధర రూ.11,999 గా, 6GB+128GB వేరియంట్ ధర రూ.12,999 ఉండనున్నట్లు సమాచారం. Galaxy M13 5G కూడా ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్లలో లభించనుంది. 4GB+64GB వేరియంట్ ధర రూ.14,999 గా, 6GB+128GB వేరియంట్ ధర రూ.15,999 ఉండనున్నట్లు సమాచారం.
ఈ రెండు మోడల్ మొబైల్స్ కూడా మూడు డిఫరెంట్ కలర్లలో అందుబాటులో ఉండనున్నాయి. మిడ్‌నైట్ బ్లూ, అక్వా గ్రీన్, స్టార్ డస్ట్ బ్రౌన్ కలర్లలో అందుబాటులోకి రానున్నాయి. రెండు గెలాక్సీ M13 మోడల్‌లు జూలై 14న ఆవిష్కరించబడిన తర్వాత జూలై 23 నుండి అమెజాన్ ద్వారా భారతదేశంలో విక్రయించబడతాయని నివేదిక పేర్కొన్నట్లు రూమర్ల ద్వారా తెలిసింది.

Samsung Galaxy M13 4G లీక్‌డ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ కు 6.6 అంగుళాల full-HD + nfinity-V డిస్‌ప్లే ను అందిస్తున్నారు. octa-core Samsung Exynos 850 5G ప్రాసెసర్ ను కలిగి ఉంది. Samsung Galaxy M13 4G మోడల్ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్లలో లభించనుంది. 4GB+64GB| 6GB+128GB వేరియంట్లలో లభించనుంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్రధాన కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సెల్ఫీ మరియు వీడియో కాల్ కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 6000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Samsung Galaxy M13 5G లీక్‌డ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ కు 6.5 అంగుళాల full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు.Samsung Galaxy M13 5G మోడల్ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్లలో లభించనుంది. 4GB+64GB| 6GB+128GB వేరియంట్లలో లభించనుంది. ఈ మొబైల్ డ్యుయల్ కెమెరా సెటప్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 5000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు.

ఇప్పటికే భారత్‌లో అందుబాటులో ఉన్న Samsung Galaxy M32 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ కు 6.4 అంగుళాల HD+AMOLED పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core MediaTek Helio G80 12nm ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్| 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో కలిగి ఉంది.ఈ మొబైల్ One UI 3.1based ఆండ్రాయిడ్ 11ఓఎస్ పనిచేస్తుంది. 64 మెగాపిక్సల్ క్వాలిటీలో ప్రైమరీ ప్రధాన కెమెరా ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 20 మెగా పిక్సల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 6000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470