రూ.8,499 కే 6.7 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ Samsung స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు
శాంసంగ్ సంస్థ ఇటీవల గెలాక్సీ F15 5G స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే కొద్దిరోజుల్లోనే శాంసంగ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. శాంసంగ్ గెలాక్సీ M14 4G ( Samsung Galaxy M14 4G Smartphone ) ఫోన్ లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
6.7 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లే : శాంసంగ్ గెలాక్సీ M14 4G స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2400 పిక్సల్ రిజల్యూషన్ సహా 90Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డ్యూయల్ సిమ్ కార్డులను సపోర్టు చేస్తుంది. మరియు భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

స్నాప్ డ్రాగన్ 680 చిప్ సెట్ : ఈ శాంసంగ్ గెలాక్సీ M14 హ్యాండ్ సెట్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 680 చిప్ సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత One UI 5.1 పైన పనిచేస్తుంది. రెండు సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యురిటీ అప్‌డేట్లు ఇస్తామని శాంసంగ్ హామీ ఇచ్చింది.
25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ : శాంసంగ్ గెలాక్సీ M14 4G హ్యాండ్ సెట్ 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
50MP ప్రైమరీ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా : ఈ శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. అందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 2MP మ్యాక్రో కెమెరాలను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ M14 4G హ్యాండ్ సెట్ 13MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M14 4G ధర : శాంసంగ్ గెలాక్సీ M14 4G హ్యాండ్ సెట్ 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,499 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. ఆర్టిక్ బ్లూ, Sapphire బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








