Home
Mobile

ధర రూ.10999 కే 6000mAh బ్యాటరీ, ట్రిపుల్‌ కెమెరాలతో 5G ఫోన్‌.. 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌..!

భారత్‌ మార్కెట్‌లో గత సంవత్సరం సెప్టెంబర్‌లో శాంసంగ్‌ బడ్జెట్‌ ధరలో గెలాక్సీ M15 5G ప్రైమ్‌ ఎడిషన్‌ ను (Samsung Galaxy M15 5G Prime Edition Smartphone) విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.5 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది. మరియు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.

స్టోరేజీ వేరియంట్‌లు :
శాంసంగ్‌ గెలాక్సీ M15 5G ప్రైమ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తోంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.10,999 గా ఉంది.

Samsung galaxy M15 5G Prime Edition

కలర్‌ వేరియంట్స్‌ :
ఎంపిక చేసిన బ్యాంకు కార్డు ద్వారా గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అమెజాన్‌లో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సెలెస్టియల్‌ బ్లూ, బ్లూ టోపాజ్‌, స్టోన్‌ గ్రే కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
గెలాక్సీ M15 5G ప్రైమ్‌ ఎడిషన్‌ ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ Knox, క్విక్‌ షేర్‌, కాల్‌ క్లారిటీ కోసం వాయిస్‌ ఫోకస్‌ ఫీచర్‌లను కలిగి ఉంది.

5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.0 OS ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని శాంసంగ్‌ వెల్లడించింది.

ట్రిపుల్‌ కెమెరా :
గెలాక్సీ M15 5G ప్రైమ్‌ ఎడిషన్‌ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌తో 5MP లెన్స్‌, f/2.4 అపేచర్‌తో 2MP కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం f/2.0 అపేచర్‌తో 13MP కెమెరాతో అందుబాటులో ఉంది. 30fps వద్ద FHD రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డు చేయవచ్చు.

6000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ 25W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ 5G, 4G LTE, 3.5mm ఆడియో జాక్‌, బ్లూటూత్ 5.3, వైఫై, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy M15 5G Prime Edition smartphone gets best deal on amazon check features and specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X