Home
Mobile

ధర రూ.10,999 కే 6000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్‌.. అమెజాన్‌లో సేల్‌..!

శాంసంగ్‌ నుంచి కొత్త ఫోన్‌ లాంచ్‌ అయింది. శాంసంగ్‌ గెలాక్సీ M15 5G ప్రైమ్‌ ఎడిషన్‌ (Samsung Galaxy M15 5G Prime Edition Smartphone) భారత్‌లో విడుదల అయింది. గెలాక్సీ M15 5G స్టాండర్డ్‌ మోడల్‌ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు మూడు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ను శాంసంగ్ వెబ్‌సైట్‌, అమెజాన్‌లో (Amazon) కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో తగ్గింపు ధరను పొందవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ M15 5G ప్రైమ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
శాంసంగ్‌ గెలాక్సీ M15 5G ప్రైమ్‌ ఎడిషన్‌ హ్యాండ్‌సెట్‌ 6.5 అంగుళాల FHD+ (1080*2340 పిక్సల్స్‌) సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 19.5:9 యాస్పెక్ట్‌ రేషియోతో విడుదల అయింది.

Samsung Galaxy M15 5G Prime Edition Smartphone specs

ఈ ప్రైమ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.0 OS ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ నాలుగు OS అప్‌డేట్‌లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందనుందని శాంసంగ్ తెలిపింది.

50MP కెమెరా, 6000mAh భారీ బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ప్రైమ్‌ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 5MP, 2MP కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 13MP కెమెరాను అమర్చారు. 25W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Samsung Galaxy M15 5G Prime Edition Smartphone specs

దీంతోపాటు ఈ శాంసంగ్‌ గెలాక్సీ M15 5G ప్రైమ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ Knox సెక్యూరిటీతో పాటు క్విక్‌ షేర్‌ ఫీచర్‌లు, కాల్ నాణ్యత కోసం వాయిస్‌ ఫోకస్‌ ఫీచర్‌లతో విడుదల అయింది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, GPS, బ్లూటూత్‌ 5.3, వైఫై, USB-C, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ M15 5G ప్రైమ్‌ ఎడిషన్‌ ధర, సేల్ వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ M15 5G ప్రైమ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499 గా ఉంది.

Samsung Galaxy M15 5G Prime Edition Smartphone specs

ఈ శాంసంగ్‌ కొత్త హ్యాండ్‌సెట్‌ను శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ సహా ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రైమ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్లూ టోపాజ్‌, సెలెస్టియల్‌ బ్లూ మరియు స్టోన్‌ గ్రే రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M15 5G Prime Edition Smartphone with 6000mAh Battery sale is live on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X