6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ముందస్తు బుకింగ్ ప్రారంభం.. ఆఫర్ల వివరాలు..!
శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M15 5G Smartphone) భారత్ మార్కెట్‌లో ఏప్రిల్ 8న లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్‌లో మెరుగైన పనితీరు, కొత్త ఫీచర్లతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. దీంతోపాటు ఆకట్టుకొనే డిజైన్‌తో విడుదల కానుంది.
ఏప్రిల్ 8న విడుదల కానుండగా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ ముందస్తు బుకింగ్ చేసుకొనే (Samsung Galaxy M15 5G Smartphone Pre bookings) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆకట్టుకొనే ఆఫర్ల వివరాలను వెల్లడించింది.

శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.999 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా బుకింగ్ చేసుకున్న కస్టమర్లు రూ.1699 విలువైన 25W ఛార్జర్‌ను రూ.299 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు HDFC క్రెడిట్ కార్డు ద్వారా బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు మూడు నెలలపాటు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్ ధర..
శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499 గా ఉంది. అదే 6GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సెలెస్టియల్ బ్లూ, స్టోన్ గ్రే, బ్లూ టోపాజ్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లను సంస్థ ధ్రువీకరించింది. ఈ హ్యాండ్‌సెట్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే ద్వారా మెరుగైన విజువల్ అనుభూతిని పొందుతారని తెలుస్తోంది. వీడియో డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (VDIS) ఫీచర్‌ను కలిగి ఉంది.
దీంతోపాటు ఈ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా ద్వారా నాణ్యమైన ఫొటోలను క్యాప్చర్ చేయవచ్చు. మరో రెండు కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను కలిగి ఉంది. 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
4 సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు : శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్ ఫోన్ మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కలిగి ఉంటుంది. నాలుగు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లను పొందవచ్చు. దీంతోపాటు ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్ డేట్లను పొందవచ్చని శాంసంగ్ తెలిపింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications