Home
Mobile

ధర రూ.11,999 కే 6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజీ శాంసంగ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌.. సేల్‌ పూర్తి వివరాలు..!

శాంసంగ్‌ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy M15 5G Smartphone) ఈ సంవత్సరం ఏప్రిల్‌లో భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ M15 5G స్మార్ట్‌ఫోన్‌ 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.13999 గా ఉంది. ప్రస్తుతం 19 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. Arm Mali G57 MC2 GPU తో జతచేయబడుతుంది.

samsung galaxy M15 5G Smartphone

ఈ శాంసంగ్‌ ఫోన్‌ 4GB ర్యామ్‌ మరియు 128GB స్టోరేజీని కలిగి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 6GB + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.

ఈ శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2340 పిక్సల్‌ రిజల్యూషన్‌, 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 4 సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను పొందనుందని శాంసంగ్‌ తెలిపింది.

samsung galaxy M15 5G Smartphone

ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రావైడ్‌ కెమెరా, 2MP మాక్రో కెమెరాలను కలిగి ఉంది. ఈ కెమెరాలు ఆటో ఫోకస్‌ సపోర్టు, పుల్‌ HD వీడియో రికార్డింగ్‌, డిజిటల్‌ జూమ్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. LED ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంది. ముందువైపు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ 25W వైరడ్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కనెక్టివిటీ ఫీచర్ల పరంగా 5G, డ్యూయల్‌ 4G VoLTE, వైఫై 802.11, బ్లూటూత్‌ 5.3, USB-C ఛార్జింగ్‌ పోర్టు సహా 3.5 ఆడియో జాక్‌ను కలిగి ఉంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ అమెజాన్‌లో రూ.12,999 గా ఉంది. ICICI బ్యాంకు, HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11999 కే సొంతం చేసుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung galaxy M15 5G Smartphone price drop on amazon 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X