Home
Mobile

శామ్‌సంగ్ లవర్స్‌కు కికిచ్చే న్యూస్.. త్వరలోనే గెలాక్సీ M16 5G, గెలాక్సీ M06 5G లాంచ్.. ఫీచర్లు అదుర్స్!

Samsung Galaxy M16 5G: శామ్‌సంగ్ తన అభిమానుల కోసం నిత్యం సరికొత్త ఫోన్లను తీసుకొస్తోంది. ఇప్పుడు వారికి మరొక శుభవార్త చెప్పింది. ఇండియన్‌ మార్కెట్‌లోకి రెండు అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు విడుదల చేస్తున్నామని ప్రకటించింది. అవే గెలాక్సీ M16 5G, గెలాక్సీ M06 5G. గెలాక్సీ A16 5G, గెలాక్సీ A06 5G భారతదేశంలో విడుదలైన కొద్ది రోజులకే ఈ గుడ్‌న్యూస్ చెప్పేశారు. కొత్త ఫోన్లు అదిరిపోయే ఫీచర్లతో, పర్ఫార్మెన్స్‌తో మీ ముందుకు రాబోతున్నాయి.

గెలాక్సీ M06 5G మొబైల్ ఇదివరకే శామ్‌సంగ్ ఇండియా సపోర్ట్ పేజీలో దర్శనమిచ్చింది, గీక్‌బెంచ్‌లో కూడా లిస్టింగ్ అయిపోయింది. ఫీచర్ల విషయానికొస్తే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8GB RAMతో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్, శామ్‌సంగ్ వన్ UI 6తో వస్తుంది.

Samsung Galaxy M16 5G  Galaxy M06 5G Teased for India Launch  Amazon Availability Confirmed

అంతేకాదు, ఈ ఫోన్లకు చాలా కాలం పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇస్తామని శామ్‌సంగ్ చెప్పింది. అంటే మీ ఫోన్ ఎప్పుడూ లేటెస్ట్ ఫీచర్లతో, సెక్యూరిటీతో పదిలంగా ఉంటుంది. గెలాక్సీ M06 5G మోడల్ నంబర్ SM-M166P/DS. దీని లోపల పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది.

8GB RAM ఉండటంతో మల్టీటాస్కింగ్ సూపర్ స్మూత్‌గా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే, ఆండ్రాయిడ్ 14, శామ్‌సంగ్ వన్ UI 6తో ఇది వస్తుంది. డిజైన్ పరంగా చూస్తే, M06 5G పాత మోడల్ కంటే కొంచెం కొత్తగా ఉంటుంది. టీజర్ చూస్తే కెమెరా సెటప్ మారింది, కానీ ఫ్లాష్ మాత్రం పాత స్టైల్లోనే ఉంది.

ఫీచర్ల పరంగా చూస్తే ఈ ఫోన్ F06 మోడల్‌కి దాదాపు దగ్గరగా ఉంటుందంటున్నారు. మరి ధర కూడా అదే రేంజ్ లో నిర్ణయిస్తారో లేదో చూడాలి. తక్కువ ధరలోనే వీటిని తీసుకువచ్చే అవకాశం ఉంది. M series అంటేనే బడ్జెట్ ఫోన్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

* శామ్‌సంగ్ గెలాక్సీ M16 5G

గెలాక్సీ M16 5G మాత్రం చాలా మంచి ఫీచర్లతో వస్తుంది. ప్రస్తుతానికి పూర్తి వివరాలు బయటకు రాకపోయినా, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6GB RAM వరకు ఉండొచ్చని లీకులు వస్తున్నాయి. M06 ఆండ్రాయిడ్ 14తో వస్తుంటే, M16 మాత్రం ఏకంగా ఆండ్రాయిడ్ 15, One UI 7తో వస్తుందట.

- సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ

వినియోగదారులకు శామ్‌సంగ్ ఇచ్చిన అతిపెద్ద హామీ ఏంటంటే, ఈ రెండు ఫోన్లకి ఏకంగా నాలుగు తరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు ఇస్తారట. అంటే ఫోన్ కొన్నేళ్ల వరకు పర్ఫెక్ట్‌గా, సెక్యూర్‌గా పనిచేస్తుంది. హార్డ్‌వేర్‌తోనే సరిపెట్టకుండా, కస్టమర్ల కోసం సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కూడా ముఖ్యమని శాంసంగ్ భావిస్తోంది.

* ఎక్కడ దొరుకుతాయి, ఎలా కొనాలి

గెలాక్సీ M16 5G, గెలాక్సీ M06 5G ఫోన్లు అమెజాన్ లో దొరుకుతాయి, శామ్‌సంగ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంటాయి, ఇంకా దగ్గరలోని శామ్‌సంగ్ స్టోర్స్‌లో కూడా లభిస్తాయి. నచ్చిన చోట ఈజీగా కొనుక్కోవచ్చు. భారతీయ కస్టమర్లకు బెస్ట్ ఫీచర్లు, నమ్మకమైన ఫోన్లు ఇవ్వాలనే శామ్‌సంగ్ ఆలోచనకు ఈ లాంచ్ ఒక నిదర్శనం.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung launching Galaxy M16 5G, M06 5G in India. M06 has Dimensity 6300, 8GB RAM, Android 14. M16 expected with Dimensity 6300, Android 15. Both get long updates, available on Amazon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X