Home
Mobile

రూ.10749 ధరకే 128GB స్టోరేజీ, 5000mAh బ్యాటరీ, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ 5G లేటెస్ట్‌ ఫోన్‌..!

భారత్‌ మార్కెట్‌లో శాంసంగ్ ఈ సంవత్సరం అనేక ఎంట్రీ, బడ్జెట్‌ రేంజ్‌ ఫోన్లను విడుదల చేసింది. మార్చిలో గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ రేంజ్‌ లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ ఏకంగా 6 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ అమెజాన్‌లో డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ (Samsung galaxy M16 5G) విడుదల సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12499 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15499 గా ఉండేది.

Samsung galaxy M16 5G

గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ :
ప్రస్తుతం అమెజాన్‌లో 4GB ర్యామ్ వేరియంట్ ను రూ.10749 గా ఉంది. అంటే రూ.1750 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే 6GB ర్యామ్‌ను రూ.11999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే విడుదల ధరతో పోలిస్తే రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

సన్నని డిజైన్ :
8GB ర్యామ్‌ను రూ.2000 డిస్కౌంట్‌తో రూ.13999 కే కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్‌ బ్లష్‌ గ్రీన్‌, మింట్‌ గ్రీన్‌, థండర్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 7.9mm థిక్‌నెస్‌తో సూపర్‌ స్లీ్క్‌ డిజైన్‌తో అందుబాటులో ఉంది.

6 సంవత్సరాల అప్‌డేట్స్‌ :
శాంసంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 OS పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది.

5000mAh బ్యాటరీ :
ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్‌ 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్‌, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు 13MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫోన్‌ IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు Knox vault, వాయిస్ ఫోకస్, క్విక్‌ షేర్ ఫీచర్లున్నాయి. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లున్నాయి. 5G, 4G, బ్లూటూత్‌ 5.3, డ్యూయల్‌ బ్యాండ్ వైఫై, GPS, USB-C ఛార్జింగ్‌ వంటి ఫీచర్‌లున్నాయి.

శాంసంగ్‌ నుంచి ఇటీవలే గెలాక్సీ S25 ఎడ్జ్ హ్యాండ్‌సెట్‌ విడుదల అయింది. ఫ్లాగ్‌షిప్‌ సెగ్మెంట్‌లో స్లిమ్‌ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. టఫ్‌ టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. 6.7 అంగుళాల QHD+ అమోలెడ్‌ ప్యానల్‌ను కలిగి ఉంది. 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy M16 5G smartphone gets rs1750 discount on 4GB RAM variant amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X