Home
Mobile

ధర రూ.11499 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ 5G ఫోన్‌!

భారత్‌ ఫిబ్రవరి నెలలో M సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను శాంసంగ్‌ విడుదల చేసింది. గెలాక్సీ M16 5G, గెలాక్సీ M06 5G హ్యాండ్‌సెట్‌లను విడుదల చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ సేల్‌ (Samsung Galaxy M16 5G Smartphone Sale) ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ ఏకంగా 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, ఆరు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందనుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 7.9mm సూపర్‌ స్లీక్‌ డిజైన్‌ను కలిగి ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.11,499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14499 గా ఉంది. ఈ ఫోన్‌లను మింట్‌ గ్రీన్‌, థండర్‌ బ్లాక్‌, బ్లష్‌ పింక్‌ కలర్‌ వేరియంట్స్‌ సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy M16 5G Smartphone sale

శాంసంగ్ గెలాక్సీ M16 5G డిస్‌ప్లే వివరాలు :
శాంసంగ్ ఫోన్‌ 6.7 అంగుళాల ఫుల్‌ HD+ (1080*2340) సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో భారత్‌ మార్కెట్ అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. విజన్ బూస్టర్, ఐ కేర్‌ షీల్డ్‌ వంటి ఫీచర్‌లున్నాయి. ఎక్కువ సమయం ఫోన్‌ వినియోగించినా కళ్లకు హాని కలగకుండా ఫీచర్‌లను కలిగి ఉంది.

ట్రిపుల్‌ కెమెరా :
ఈ గెలాక్సీ M16 5G హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను అమర్చారు. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 5MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 2MP డెప్త్ సెన్సార్‌లను కలిగి ఉంది. దీంతోపాటు ముందువైపు 13MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి తీసుకొచ్చారు.

Samsung Galaxy M16 5G Smartphone sale

శాంసంగ్ 5G హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 OS ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా 6 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని శాంసంగ్ విడుదల సమయంలో హామీ ఇచ్చింది.

5000mAh బ్యాటరీ :
ఈ ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌ అందుబాటులో ఉంది. బ్యాటరీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కనెక్టివిటీ పరంగా శాంసంగ్‌ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.3, Wi-Fi, USB-C ఛార్జింగ్‌ ఫోర్ట్‌ను కలిగి ఉంది. ట్యాప్‌ అండ్‌ పే ఫీచర్‌తో శాంసంగ్‌ వ్యాలెట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు శాంసంగ్‌ Knox vault, వాయిస్ ఫోకస్, క్విక్‌ షేర్ వంటి ఫీచర్‌లున్నాయి.

ఈ హ్యాండ్‌సెట్‌ భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. దీంతోపాటు IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ 7.99mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది.

* ఈ హ్యాండ్‌సెట్‌తోపాటు శాంసంగ్‌ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా విడుదల అయింది. దీని ప్రారంభ ధర రూ.9499 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10999 గా ఉంది. ఈ ఫోన్‌ 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP కెమెరాతో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M16 5G Smartphone sale to start from today via amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X