రూ.11499 కే 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్..!
Samsung Galaxy M16 5G Smartphone : శాంసంగ్ నుంచి ఈ సంవత్సరం తొలి రోజుల్లో అనేక బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ లు విడుదల అయ్యాయి. ఇందులో శాంసంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకొనే డిజైన్, బెస్ట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంది. సూపర్ స్లీ్క్ డిజైన్‌ను కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ మూడు కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ను అమెజాన్ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ప్రారంభ ధర రూ.11499 :
శాంసంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999 గా ఉంది. ఈ ఫోన్ బ్లష్ పింక్, మింట్ గ్రీన్, థండర్ బ్లాక్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
శాంసంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల FHD+ (1080 x 2340 పిక్సల్స్) సూపర్ అమెజాన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే ఐ కేర్ షీల్డ్, విజన్ బూస్టర్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. IP54 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 OS పైన పనిచేస్తోంది. ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.

మూడు కెమెరాల స్మార్ట్‌ఫోన్ :
శాంసంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలతో అందుబాటులో ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్‌లను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చారు.
5000mAh బ్యాటరీ సహా అనేక ఫీచర్లు :
ఈ ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చారు. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.3, WiFi, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. శాంసంగ్ Knox Vault, వాయిస్ ఫోకస్, క్విక్ షేర్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
బడ్జెట్ ధరలో 5G కోసం చూసే వారికి ఈ ఫోన్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ప్రధానంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటివి ఆకట్టుకొనే అవకాశం ఉంది. విజన్ బూస్టర్ వంటి ఫీచర్‌లను కూడా కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








