Home
Mobile

రూ.12,499 ధరకే 6 సంవత్సరాల అప్‌డేట్స్‌, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్..!

శాంసంగ్‌ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్‌లో లాంచ్‌ అయింది. ఇప్పటికే గెలాక్సీ A17, F17 ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా M17 5G మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు అనేక మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. బడ్జెట్ ధరలో ఈ ఫోన్‌ విడుదల అయింది.

శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M17 5G Smartphone) 6.7 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1100 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

Samsung Galaxy M17 5G smartphone launched

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ Exynos 1330 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మైక్రో SD కార్డుతో స్టోరేజీని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OneUI 7 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని శాంసంగ్‌ తెలిపింది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) తో 50MP కెమెరా, 5MP అల్ట్రావైడ్‌, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను అమర్చారు.

Samsung Galaxy M17 5G smartphone launched

ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు :
ఈ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ వాయిస్ మెయిల్‌, శాంసంగ్ Knox Vault, వాయిస్‌ ఫోకస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్‌ ట్యాప్‌ అండ్ పే ఆప్షన్‌తో శాంసంగ్ వాలెట్ ఫీచర్‌ కూడా ఉంది. మరియు జెమిని, జెమిని లైవ్‌తో కూడిన సర్కిల్‌ టు సెర్చ్‌ ఫీచర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5G, 4G, బ్లూటూత్‌, వైఫై, NFC వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Take a Poll

శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12499 గా ఉంది. అదే 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15499 గా ఉంది.

ఈ ఫోన్‌ను ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ అక్టోబర్‌ 13 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మూన్‌లైట్‌ సిల్వర్‌, Sapphire బ్లాక్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M17 5G smartphone launched with Exynos 1330 chip, 6 years of updates in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X