Home
Mobile

శాంసంగ్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌.. సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP OIS కెమెరా సహా..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ భారత్ మార్కెట్‌ లో ఆగస్టు చివరలో గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. అదే విధంగా సెప్టెంబర్ రెండో వారంలో గెలాక్సీ F17 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్‌ రేంజ్‌ లో ఈ రెండు ఫోన్‌లు విడుదల అయ్యాయి. మరియు 6 సంవత్సరాల అప్‌డేట్స్‌ను పొందనున్నాయి. త్వరలో శాంసంగ్‌ నుంచి మరో బడ్జెట్ ఫోన్‌ విడుదల కానుంది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

ఎప్పుడు విడుదల కానుంది :
శాంసంగ్‌ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy M17 5G Smartphone Launch Date) త్వరలో విడుదల కానుంది. అక్టోబర్ 10 వ తేదీన విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ మూన్‌లైట్‌ సిల్వర్‌, Sapphire బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే, కెమెరా సహా ఇతర వివరాలు.

samsung galaxy M17 5G smartphone

సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే :
ఈ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌ 7.5mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో విడుదల కానుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను పొందుతుంది. ఈ ఫోన్‌ IP54 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

50MP OIS కెమెరా :
ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP కెమెరాను కలిగి ఉంటుంది. మిగిలిన కెమెరాల వివరాలు తెలియాల్సి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. జెమిని లైవ్‌, సర్కిల్‌ టూ సెర్చ్‌ వంటి ఫీచర్లు ఉంటాయి.

శాంసంగ్‌ గెలాక్సీ F17 5G స్మార్ట్‌ఫోన్‌ :
గత నెలలో శాంసంగ్‌ గెలాక్సీ F17 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్‌ 6.7 అంగుళాల ఫుల్‌ HD+ ఇన్ఫినిటీ U సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. Exynos 1330 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ లెన్స్‌, 2MP మ్యాక్రో కెమెరా, 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 25W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ గెలాక్సీ F17 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది. ఈ ఫోన్‌ గూగుల్‌ జెమిని, సర్కిల్‌ టూ సెర్చ్‌ వంటి AI ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung galaxy M17 5G smartphone with 50MP OIS Camera set to launch on october 10 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X