6 సంవత్సరాల అప్‌డేట్స్ ఇచ్చే బడ్జెట్ ఫోన్‌పై డిస్కౌంట్.. 50MP కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సహా..!
శాంసంగ్ ఈ సంవత్సరం బడ్జెట్ రేంజ్ లో అనేక స్మార్ట్‌ఫోన్ లను తీసుకొచ్చింది. ముఖ్యంగా A, M, F సిరీస్ లో అనేక మోడల్స్ ను తీసుకొచ్చింది. ఇటీవల విడుదల అయిన కొన్ని ఫోన్‌లు ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను అందిస్తున్నాయి. ఈ సంవత్సరం నవంబర్ లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ పై (Samsung Galaxy M17 5G Smartphone) డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ఫోన్ 6 ఏళ్ల అప్‌డేట్స్ తోపాటు స్లిమ్ ప్రొఫైల్ ను కలిగి ఉంది.
రూ.1000 డిస్కౌంట్ :
ప్రస్తుతం అమెజాన్ లో శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15,499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.16,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్ ను పొందవచ్చు.

సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే :
శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. మరియు 7.5mm థిక్‌నెస్ తో స్లిమ్ ప్రొఫైల్ ను కలిగి ఉంది.
6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్ :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ Exynos 1330 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OneUI 7 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులో వచ్చినా ఏకంగా 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
ట్రిపుల్ కెమెరా యూనిట్ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్ ను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 5MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా ఉంది.
ఫాస్ట్ ఛార్జింగ్, ట్యాప్ అండ్ పే ఫీచర్ :
గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. శాంసంగ్ Knox Vault, వాయిస్ మెయిల్, వాయిస్ ఫోకస్, ట్యాప్ అండ్ పే ఫీచర్ తో శాంసంగ్ వాలెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కూడా ఉంది. మూన్‌లైట్ సిల్వర్, Sapphire బ్లాక్ కలర్ వేరియంట్స్ లో లభిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+ భారత్ మార్కెట్‌లో ఇటీవల విడుదల అయింది. 11 అంగుళాల TFT LCD డిస్‌ప్లే, మీడియాటెక్ MT8775 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8 పైన పనిచేస్తోంది. ఈ ట్యా్బ్లెట్ 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది. 8MP, 5MP కెమెరాలు ఉన్నాయి. 25W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7040mAh బ్యాటరీతో పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








