తక్కువ ధరలో 6 సంవత్సరాల అప్‌డేట్స్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ 5G ఫోన్ ఇవాళ్టి నుంచే సేల్!
Samsung Galaxy M17 5G Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ శాంసంగ్ ఇటీవల బడ్జెట్ ధరలో శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చినా ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను అందిస్తుంది. ఈ ఫోన్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సేల్ పూర్తి వివరాలు.
శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ సేల్ :
ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15499 గా ఉంది. ఇవాళ్టి నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను పొందవచ్చు. శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 1100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ మూన్ లైట్ సిల్వర్, Sapphire బ్లాక్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ Exynos 1330 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OneUI 7 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.
ట్రిపుల్ కెమెరా యూనిట్, 5000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP కెమెరా, 5MP అల్ట్రావైడ్, 2MP మ్యాక్రో కెమెరాలతోపాటు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ట్యాప్ అండ్ పే ఆప్షన్‌తో శాంసంగ్ వాలెట్ :
ఈ శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ ట్యాప్ అండ్ పే ఆప్షన్ తో శాంసంగ్ వాలెట్, వాయిస్ మెయిల్, శాంసంగ్ Knox Vault, వాయిస్ ఫోకస్ వంటి ఫీచర్ లను కలిగి ఉంది. సర్కిల్ టు సెర్చ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు ఉన్నాయి.
కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G, బ్లూటూత్, Wi-Fi, NFC వంటి ఫీచర్లతోపాటు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. IP54 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది.


Click it and Unblock the Notifications








