Home
Mobile

రూ.14 వేల కంటే తక్కువ ధరలో 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌తో 5G స్మార్ట్‌ఫోన్!

శాంసంగ్‌ నుంచి భారత్‌ మార్కెట్‌లో ఫిబ్రవరి రెండో వారంలో గెలాక్సీ F70e స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. గత నెల చివరి వారంలో గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ నిర్వహించింది. ఇందులో శాంసంగ్‌ గెలాక్సీ S26 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. అయితే త్వరలో గెలాక్సీ M సిరీస్‌ నుంచి మరో హ్యాండ్‌సెట్‌ విడుదల కానుంది. ఈ వివరాలను తాజాగా శాంసంగ్ వెల్లడించింది.

శాంసంగ్ గెలాక్సీ M17e 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M17e 5G Smartphone) భారత్‌లో మార్చి 17 వ తేదీన విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్‌ ప్రారంభం అయింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలను వెల్లడించింది.

samsung galaxy m17e 5g smartphone launch date

డిస్‌ప్లే వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ M17e 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే అడాప్టివ్‌ బ్రైట్‌నెస్‌ను సపోర్టు చేస్తుంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 8.2mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

మీడియాటెక్‌ చిప్‌ :
గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీతో బేస్‌ వేరియంట్‌గా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.0 పైన పనిచేస్తుంది. లైవ్‌ నోటిఫికేషన్స్‌ ఫీచర్‌ ఉంటుంది. గూగుల్‌ జెమిని AI అసిస్టెంట్‌తో ఇంటిగ్రేట్ చేసి ఉంటుంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్‌ సర్కిల్ టూ సెర్చ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 26 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ను అందిస్తుందని చెబుతోంది.

samsung galaxy m17e 5g smartphone launch date

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. ఇందుల 50MP ప్రైమరీ, 2MP డెప్త్‌ సెన్సర్‌లు ఉంటాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుందని శాంసంగ్‌ తెలిపింది.

అమెజాన్‌ వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ రూ.14 వేల కంటే తక్కువ ధరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. రూ.10 వేల నుంచి రూ.14 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. బ్లిర్జ్‌ బ్లూ, వైబ్‌ వైలెట్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుంది.

గత సంవత్సరం శాంసంగ్‌ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. 6.7 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. Exynos 1330 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OneUI 7 పైన పనిచేస్తోంది. 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని శాంసంగ్‌ తెలిపింది.

కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) తో 50MP కెమెరా, 5MP అల్ట్రావైడ్‌, 2MP మ్యాక్రో లెన్స్‌, 13MP సెల్ఫీ కెమెరాలున్నాయి. 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung galaxy m17e 5g smartphone confirmed to launch on march 17 in india specifications, features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X