Home
Mobile

రూ.11,749 ధరకే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌తో 5G ఫోన్‌..!

శాంసంగ్ నుంచి బడ్జెట్ ధరలో ఇటీవల గెలాక్సీ F70e స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ అయింది. తాజాగా అదే సెగ్మెంట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ M17e 5G ఫోన్‌ విడుదల అయింది. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ రూ.12 వేల కంటే తక్కువ ధరలోనే ప్రస్తుతం అందుబాటులో ఉంది. అమెజాన్‌ ఇవాళ్టి నుంచే కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ M17e 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ శాంసంగ్‌ ఫోన్‌ (Samsung Galaxy M17e 5G Smartphone) 6.58 అంగుళాల HD+ PLS LCD డిస్‌ప్లేతో విడుదల అయింది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Samsung galaxy M17e 5G sale in india

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 6GB ర్యామ్‌, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OneUI 8 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా శాంసంగ్‌ గెలాక్సీ M17e 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఆటోఫోకస్ సామర్థ్యంతో 50MP కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరా ఉంది. 30fps తో 1080p వీడియో రికార్డింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Samsung galaxy M17e 5G sale in india

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.3, వైఫై, 3.5mm ఆడియో జాక్‌, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. లైట్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, జియోమాగ్నటిక్‌, గైరోస్కో్ప్‌, యాక్సెలిరోమీటర్‌ సెన్సార్‌లు ఉన్నాయి. భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ఉంది.

ధర, సేల్‌ వివరాలు :
గెలాక్సీ M17e 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11749, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13249 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. అయితే తొలి ఆఫర్‌లో భాగంగానే ఈ ధరకు అందిస్తున్నట్లు చెబుతోంది.

ఆఫర్‌ ముగిసిన తర్వాత ఈ ఫోన్‌ ధరలు రూ.12,999, రూ.14,449 గా ఉండనున్నాయి. ఈ గెలాక్సీ M17e 5G స్మార్ట్‌ఫోన్‌ వైబ్‌ వైలెట్‌, బ్లిల్జ్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy M17e 5G smartphone with 6000mAh battery launched, sale is live in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X