రూ.11999 ధరకే శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్.. ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్, 6000mAh బ్యాటరీ!
శాంసంగ్ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇటీవల M సిరీస్ ఫోన్‌ను తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ M17e పేరుతో మార్చి 17 న విడుదల అయింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.12 వేల కంటే తక్కువ ధరలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
రూ.11999 ప్రారంభ ధరకు :
శాంసంగ్ గెలాక్సీ M17e స్మార్ట్‌ఫోన్ ను (Samsung Galaxy M17e 5G Smartphone) ప్రస్తుతం అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11,999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13499 గా ఉంది. స్మార్ట్‌ఫోన్ వైబ్ వైలెట్, బ్లిల్జ్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ M17e 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల HD+ PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 8.2mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OneUI 8 పైన పనిచేస్తుంది. ఈ గెలాక్సీ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని శాంసంగ్ హామీ ఇచ్చింది. బడ్జెట్ ధరలో ఏకంగా 6 సంవత్సరాల అప్‌డేట్స్ ఆకట్టుకొనే అవకాశం ఉంది. కేవలం ప్రీమియం మోడల్స్‌కు మాత్రమే ఇన్ని సంవత్సరాల అప్‌డేట్స్‌ను సంస్థలు అందిస్తున్నాయి.

50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
గెలాక్సీ M17e 5G స్మార్ట్‌ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP కెమెరా, 2MP సెకండరీ లెన్స్ ఉన్నాయి. దీంతోపాటు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. 30fps తో 1080p వీడియో రికార్డింగ్ చేయవచ్చు.
కనెక్టివిటీ పరంగా శాంసంగ్ గెలాక్సీ M17e ఫోన్ 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, 3.5mm ఆడియో జాక్, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీంతోపాటు గైరోస్కో్ప్, యాక్సెలిరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, జియోమాగ్నటిక్ సెన్సార్‌లు ఉన్నాయి.
* శాంసంగ్ ఇటీవల గెలాక్సీ F70e స్మార్ట్‌ఫోన్ ను బడ్జెట్ ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8 OS ను కలిగి ఉంది. 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను పొందుతుంది. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ రూ.12 వేల కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది


Click it and Unblock the Notifications








