Samsung Galaxy M31 కొత్త ఫోన్ ధరలు, స్పెసిఫికేషన్స్ ఇవే...

|

ఇండియాలో శామ్‌సంగ్ యొక్క కొత్త ఫోన్ గెలాక్సీ M31 రూ.15,999ల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని కొత్త నివేదిక తెలిపింది. ఫిబ్రవరి 25 న ఇండియాలో అధికారికంగా గెలాక్సీ M31ను రెండు వేరియంట్లలో లాంచ్ చేయబోతున్నారు. గెలాక్సీ M31 యొక్క ఫీచర్ల విషయానికి వస్తే ఇది 6000mAh బ్యాటరీ, 64MP క్వాడ్-కెమెరా సెటప్ మరియు సూపర్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది.

గెలాక్సీ M31
 

గెలాక్సీ M31

గెలాక్సీ M 30కి అప్ డేట్ వెర్షన్ గా వస్తున్న గెలాక్సీ M31 స్మార్ట్ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. గెలాక్సీ M31 ను ఇండియాలో ఈ నెలాఖరులో ఫిబ్రవరి 25న లాంచ్ చేస్తున్నారు. అలాగే ఈ హ్యాండ్‌సెట్ యొక్క మొదటి సేల్స్ మార్చి మొదటి వారంలో మొదలు కానున్నట్లు నివేదిక పేర్కొంది. వెబ్‌లోని వివిధ నివేదికల ప్రకారం గెలాక్సీ M31 దాదాపు గెలాక్సీ M30 లలోని ఒకేలాంటి హార్డ్‌వేర్‌ను కలిగి ఉంటుంది దీనితో పాటుగా సాఫ్ట్ వెర్ విభాగంలో చాలా అప్‌గ్రేడ్ పొందింది.

Dish TV Offer: సెట్-టాప్ బాక్స్‌ల మీద లైఫ్‌టైమ్ వారంటీ

గాలక్సీ M-సిరీస్

గాలక్సీ M-సిరీస్

శామ్‌సంగ్ గాలక్సీ M ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా భారత్‌లో గత ఏడాది లాంచ్ అయింది. 2019 లో శామ్‌సంగ్ సంస్థ భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌లుగా పిలువబడే M-సిరీస్ కింద M10, M20, M30, M40, M10, M30 లు అనే ఆరు మోడళ్లను విడుదల చేసింది.

Flipkart Mobile Bonanza Sale : ఈ స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప తగ్గింపు ఆఫర్లు

గెలాక్సీ M30s

గెలాక్సీ M30s

పరిశ్రమ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం గెలాక్సీ M-సిరీస్ గత ఏడాది ఆన్‌లైన్ విభాగంలో శామ్సంగ్ యొక్క మార్కెట్ వాటాను విపరీతంగా అభివృద్ధిని పొందటానికి సహాయపడింది. గతేడాది పండుగ సీజన్‌కు ముందు లాంచ్ చేసిన గెలాక్సీ M30s 2019 లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లలో అధికంగా అమ్ముడయ్యాయి. ఇది తక్కువ వ్యవధిలోనే మిలియన్ల యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఇండియా వెలుపల గూగుల్ మ్యాప్ చాలా తేడాగా ఉంది

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

ఇటీవల ప్రైస్‌బాబా ప్రచురణ ప్రకారం శామ్‌సంగ్ గెలాక్సీ M31 యొక్క పూర్తి వివరాలను టిప్‌స్టర్ ద్వారా నివేదించింది. గెలాక్సీ M31 లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చరుతో కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. శామ్సంగ్ ఈ పరికరాన్ని రెండు కాన్ఫిగరేషన్ వేరియంట్లలో తీసుకువస్తుందని పేర్కొంది. అందులో ఒకటి 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్, మరియు మరొకటి 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్.

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

కెమెరా సెట్ అప్

కెమెరా సెట్ అప్

గెలాక్సీ M31 ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెట్ అప్ తో రాబోతున్నది. ఇందులో హైలైట్ విషయం 64 మెగాపిక్సెల్ సెన్సార్ తో ప్రైమరీ కెమెరాను కలిగి ఉండడం. మిగతా మూడు కెమెరా లెన్స్‌ల గురించి ఖచ్చితమైన వివరాలు నివేదికలలో పేర్కొనలేదు. కానీ గెలాక్సీ M31 యొక్క 64-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో 8 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్ (ఎఫ్ / 2.2 ఎపర్చరుతో), మూడవది 5 మెగాపిక్సెల్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చరుతో మరియు నాల్గవది 5 మెగాపిక్సెల్ కెమెరా ఎఫ్ / 2.4 ఎపర్చరు లెన్స్‌తో జతచేయాలని సూచించింది.

Free Wi-Fi సర్వీస్ రైల్వే స్టేషన్లలో : గూగుల్‌ అవుట్... రైల్‌టెల్ ఇన్...

డిస్ప్లే

డిస్ప్లే

డిస్ప్లే విషయంలో ఇది ఫుల్ HD + AMOLED ప్యానెల్ మరియు వాటర్‌డ్రాప్-శైలి నోచ్డ్ స్క్రీన్‌ను అందివ్వనున్నది. గెలాక్సీ ఎం 30s మాదిరిగానే ఇది కూడా టీజర్ ప్రకారం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది యుఎస్‌బి టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. దీని వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy M31 India Launch Date Confirmed on Feb 25: Price, Specs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X