Rs.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో మొదటి అమ్మకానికి Samsung Galaxy M31 Prime
ఇండియాలో అధిక జనాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్లలో శామ్సంగ్ గెలాక్సీ ఫోన్లు ఎల్లప్పుడూ ముందువరుసలో ఉంటాయి. శామ్సంగ్ సంస్థ ఇప్పుడు కొత్త శామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ ను ఇండియాలో రూ.16,499 ప్రారంభ ధర వద్ద విడుదల చేసిన సంగతి తెలిసిన విషయమే. అయితే ఈ కొత్త శామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ యొక్క అమ్మకాలు రెండు రోజులలో ఇండియాలో ప్రారంభం అవుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకంలో ప్రారంభం కానున్నాయి. అమెజాన్ లో అక్టోబర్ 17 నుండి వీటిని కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

అమెజాన్‌లో ఫెస్టివల్ సేల్ లో గెలాక్సీ M31 ప్రైమ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
శామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ ను ఇండియాలో 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌ను రూ.16,499 ధర వద్ద అందిస్తున్నది. దీనిని ఓషన్ బ్లూ, స్పేస్ బ్లాక్ మరియు ఐస్ బర్గ్ బ్లూ వంటి మూడు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు అక్టోబర్ 16 న రూ.1,000 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ ప్రయోజనంతో వీటిని కొనుగోలు చెయవచ్చు. ఇవి కాకుండా హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. శామ్‌సంగ్.కామ్ మరియు శామ్‌సంగ్ రిటైల్ దుకాణాల ద్వారా కూడా దీనిని కొనుగోలు చెయవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ ఎక్సినోస్ 9611 SoC ప్రాసెసర్ ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ అసలైన గెలాక్సీ M31 మాదిరిగానే ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9611 SoC ప్రాసెసర్‌ని కలిగి ఉండి వన్ UI 2.1 తో పాటు ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది. ఇది 6.4-అంగుళాల ఫుల్-HD + సూపర్ AMOLED ఇన్ఫినిటీ-యు డిస్ప్లేని కలిగి ఉంది. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ సహాయంతో మెమొరిని 512GB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. అలాగే ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

గెలాక్సీ M31 ప్రైమ్ క్వాడ్-కెమెరా సెటప్
శామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మిగిలిన మరో మూడు కెమెరాల్లో ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో మరో 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ కెమెరాలు 4K రికార్డింగ్, హైపర్‌లాప్స్, స్లో-మో మరియు సూపర్-స్థిరమైన మోడ్‌లను కూడా కలిగి ఉంది.

అమెజాన్ “ఆల్వేస్ ఆన్” షాపింగ్ యాప్ ఫీచర్ తో గెలాక్సీ M31 ప్రైమ్
తాజా శామ్‌సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ ఫోన్ "ఆల్వేస్ ఆన్" అమెజాన్ షాపింగ్ యాప్ ను ముందే ఇంస్టాల్ చేయబడి వస్తుంది. ఫోన్ యొక్క హోమ్ స్క్రీన్‌పై కుడివైపున స్వైప్ చేయడం ద్వారా ఈ యాప్ ని యాక్సెస్ చేయగలరు. కాబట్టి వినియోగదారులు ఫోన్ లాక్‌స్క్రీన్‌లో అమెజాన్‌లోని కొత్త మరియు ట్రెండింగ్ ఉత్పత్తుల అప్ డేట్ లను తనిఖీ చేయగలరు. వినియోగదారులు ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే కనుక వారు అమెజాన్ షాపింగ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, ఆడిబుల్ మరియు కిండ్ల్ యాప్ లను కూడా కనుగొంటారు.


Click it and Unblock the Notifications







