Home
Mobile

ధర రూ.12999కే 128GB స్టోరేజీ, 6000mAh బ్యాటరీ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్.. బ్యాంకుకార్డులతో రూ.1299 అదనపు తగ్గింపు

శాంసంగ్‌ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ఫోన్‌ను (Samsung galaxy M34 5G smartphone) డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ 6GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.16,999 గా ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను అమెజాన్‌లో తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్‌లో ఈ శాంసంగ్‌ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను రూ.12,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,299 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.11,700 కే సొంతం చేసుకోవచ్చు.

Samsung galaxy M34 5G smartphone rpice drop

శాంసంగ్‌ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల పుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2340 పిక్సల్‌ రిజల్యూషన్‌ మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణ పొందుతుంది.

ఈ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మరియు Exynos 1280 ప్రాసెసర్‌ ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 4 OS అప్‌డేట్‌లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది.

Samsung galaxy M34 5G smartphone rpice drop

ఈ హ్యాండ్‌సెట్ ర్యామ్‌ ను 12GB వరకు విస్తరించుకోవచ్చు. మరియు మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 6GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం డిస్కౌంట్‌ ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా 50MP OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంది. సెల్పీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా కలిగి ఉంది. మరియు వెనుకవైపు LED ఫ్లాష్‌తో వస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ఫోన్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. రెండు రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని సంస్థ చెబుతోంది. మరియు డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో వచ్చింది. కనెక్టివిటీ పరంగా 5G, వైఫై, బ్లూటూత్‌ సహా GPS వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్‌ ఫేస్ లాక్‌ సహా సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ శాంసంగ్‌ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ఫోన్‌ మిడ్‌నైట్‌ బ్లూ, ప్రిజం సిల్వర్‌, వాటల్‌ఫాల్‌ బ్లూ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy M34 5G smartphone gets huge discount on amazon 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X