Home
Mobile

6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 5 సంవత్సరాల అప్‌డేట్స్ అందించే శాంసంగ్‌ 5G ఫోన్‌పై రూ.3000 తగ్గింపు..!

Samsung Galaxy M35 5G : టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ గత సంవత్సరం జులైలో గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసింది. ఈ ఫోన్‌ను ప్రస్తుతం రూ.3000 ధర తగ్గింది. ఈ ఫోన్ FHD+ డిస్‌ప్లే, 50MP కెమెరా, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. బడ్జెట్‌ రేంజ్‌లో ప్రస్తుతం బెస్ట్‌ ఫోన్‌గా ఉంది. ఈ ఫోన్ డిజైన్‌ పరంగానూ ఆకట్టుకుంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

ధర, ఆఫర్ల వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ రూ.19999 కి విడుదల అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.16999 కే కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.21,499 కి విడుదల అయింది. ప్రస్తుతం రూ.18,499 గా ఉంది.

samsung galaxy M35 5G Smartphone

అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.24499 కి విడుదల కాగా.. అమెజాన్‌లో రూ.21499 కే కొనుగోలు చేయవచ్చు. ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మూడు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. మూన్‌లైట్‌ బ్లూ, డే బ్రేక్‌ బ్లూ, థండర్‌ గ్రే కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

డిస్‌ప్లే వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్‌ 6.6 అంగుళాల ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు ఈ ఫోన్‌ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్లస్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

samsung galaxy M35 5G Smartphone

చిప్‌సెట్ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ ఆక్టాకోర్‌ Exynos 1380 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. గ్రాఫిక్స్‌ టాస్క్‌ల కోసం Mali G68 MP5 GPU చిప్‌సెట్‌ను కూడా అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్ కోసం వేపర్‌ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6 OS తో అందుబాటులో ఉంది.

ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ కోసం 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తామని శాంసంగ్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

కెమెరా ఫీచర్‌లు :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌ మరియు ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సపోర్టుతో (OIS) 50MP ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను కలిగి ఉంది.

భారీ బ్యాటరీ :
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు Knox సెక్యూరిటీ ఫీచర్‌, భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, వైఫై 6, GPS, NFC, USB-C వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
samsung galaxy M35 5G Smartphone get rs3000 price drop on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X