Home
Mobile

6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ఫుల్‌ HD+ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌పై సుమారుగా రూ.6000 డిస్కౌంట్..!

Samsung Galaxy M35 5G : శాంసంగ్‌ ఇటీవల అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఎంట్రీ, బడ్జెట్‌, మిడ్‌రేంజ్‌, ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌ను విడుదల చేసింది. అయితే గత సంవత్సరం అందుబాటులోకి వచ్చిన శాంసంగ్‌ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఫోన్‌ను ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 6000mAh బ్యాటరీ. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

రూ.6524 డిస్కౌంట్‌ :
భారత్‌లో శాంసంగ్‌ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ రూ.19999 కి విడుదల అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13475 ధరకు కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.6524 డిస్కౌంట్‌ను పొందవచ్చు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21,499 కు లాంచ్‌ అయింది. ప్రస్తుతం రూ.15480 ధరకు సొంతం చేసుకోవచ్చు. అంటే రూ.6019 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Samsung Galaxy M35 5G Smartphone gets maximum Rs6000 discount on flipkart telugu

5 శాతం క్యా్‌ష్‌బ్యాక్‌ :
అదే విధంగా గెలాక్సీ M35 5G హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ రూ.24,499 అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.18950 కే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు రూ.5500 కంటే ఎక్కువ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం క్యా్‌ష్‌బ్యాక్‌ను పొందవచ్చు. మూన్‌లైట్‌ బ్లూ, డే బ్రేక్‌ బ్లూ, థండర్‌ గ్రే కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

డిస్‌ప్లే, బ్యాటరీ వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీప్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్లస్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

5 సంవత్సరాల అప్‌డేట్స్ :
ఈ శాంసంగ్‌ ఫోన్ ఆక్టాకోర్‌ Exynos 1380 చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది. గ్రాఫిక్స్‌ టాస్క్‌ల కోసం Mali G68 MP5 GPU ను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6 OS ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని శాంసంగ్‌ తెలిపింది.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS సపోర్టును కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను అమర్చారు. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ ను కలిగి ఉంది. 5G, 4G LTE, WiFi 6, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB-C వంటి ఫీచర్‌లున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M35 5G Smartphone gets maximum Rs6000 discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X