రూ.20 వేల ఫోన్‌ను రూ.13499 కే కొనుగోలు చేయవచ్చు.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ..!
Samsung Galaxy M35 5G Smartphone : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ M35 స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ గత సంవత్సరం జులైలో భారత్ మార్కెట్‌లోకి విడుదల అయింది. ఇప్పటికీ కూడా బెస్ట్ బడ్జెట్ రేంజ్ ఫోన్‌లలో ఒకటిగా ఉంది. ఈ ఫోన్ ఫుల్ HD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
రూ.6500 డిస్కౌంట్ :
భారత్‌లో ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.19999 ధరకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.13999 గా ఉంది. దీంతోపాటు కూపన్ కోడ్ ద్వారా రూ.500 తగ్గింపును పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.6500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

గెలాక్సీ M35 5G ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.21,499 కి లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.15499 గా ఉంది. దీంతోపాటు కూపన్ కోడ్ ద్వారా రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.6500 తగ్గింపును పొందవచ్చు.
ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.24499 కి లాంచ్ అయింది. అమెజాన్‌లో ప్రస్తుతం రూ.18499 గా ఉంది. కూపన్ కోడ్ ద్వారా రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ వేరియంట్ పైనా రూ.6500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ డే బ్రేక్ బ్లూ, మూన్‌లైట్ బ్లూ, థండర్ గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
శాంసంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ Exynos 1380 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం Mali G68 MP5 GPU ను కూడా అమర్చి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6 OS ను కలిగి ఉంది. వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కూడా కలిగి ఉంది. 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. 50MP OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 13MP కెమెరాను కలిగి ఉంది.
సెక్యూరిటీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు Knox సెక్యూరిటీ ఫీచర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








