Home
Mobile

శాంసంగ్‌ నుంచి త్వరలో M సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు..!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ నుంచి M సిరీస్ హ్యాండ్‌సెట్‌ విడుదల కానుందని తెలుస్తోంది. శాంసంగ్‌ కొత్త హ్యాండ్‌సెట్‌ గెలాక్సీ M35 (Samsung Galaxy M35 Smartphone) తాజాగా గూగుల్‌ ప్లే కన్సోల్‌లో కనిపించింది. దీని ద్వారా త్వరలో ఈ గెలాక్సీ M35 స్మార్ట్‌ఫోన్‌ విడుదలకు సిద్ధం అవుతుందని తెలుస్తోంది.

దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ డిజైన్ సహా ఇతర స్పెసిఫికేషన్ల వివరాలు లీక్‌ అయ్యాయి. దీని ఆధారంగా శాంసంగ్‌ గెలాక్సీ M35 స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు నిలువుగా అమర్చబడి ఉంటాయని తెలుస్తోంది. మరియు వెనుకవైపు LED ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంటుంది.

samsung Galaxy M35 smartphone

శాంసంగ్‌ గెలాక్సీ M35 స్మార్ట్‌ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్‌ గెలాక్సీ M35 స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI పైన పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే One UI 6.0 లేదా One UI 6.1 లలో ఏ OS వెర్షన్‌ను కలిగి ఉంటుందో తెలియలేదు.

కెమెరా విభాగం పరంగా ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలిసింది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా తో విడుదల కానుందని తెలుస్తోంది. మిగిలిన రెండు కెమెరాల స్పెసిఫికేషన్లు మరియు సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ 25W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

**దీంతోపాటు ఈ నెల 17న శాంసంగ్‌ నుంచి గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ మరియు కలర్‌ వేరియంట్‌ వివరాలు వెల్లడయ్యాయి. వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌తో Apricot Crush మరియు Raisin బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ F55 5G అంచనా స్పెసిఫికేషన్లు :
గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్‌ F55 హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్ + డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ మరియు 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ తో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. 25W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ శాంసంగ్‌ గెలాక్సీ F55 5G హ్యాండ్‌సెట్‌ స్నాప్ డ్రాగన్ 7 జెన్‌ 1 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ 4 సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని తెలుస్తోంది.

కెమెరా విభాగానికి వస్తే టీజర్‌ ఆధారంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP, 8MP, 2MP కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌ బ్లూటూత్‌ 5.3, వైఫై 5, USB-C పోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై శాంసంగ్‌ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung Galaxy M35 smartphone spotted on google play console full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X