Home
Mobile

శాంసంగ్‌ నుంచి M సిరీస్‌ ఫోన్.. 50MP కెమెరా, AI ఫీచర్‌లు, 7.7mm థిక్‌నెస్‌.. ఎప్పుడు విడుదల కానుంది?

Samsung Galaxy M36 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్‌ నుంచి త్వరలో మిడ్‌ రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. శాంసంగ్‌ గెలాక్సీ M36 5G పేరుతో భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. గత సంవత్సరం అందుబాటులోకి వచ్చిన గెలాక్సీ M35 5G ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా విడుదల కానుంది.

ఇటీవలే ఈ ఫోన్‌ సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది. తాజాగా ఈ ఫోన్ విడుదల తేదీ సహా ఇతర వివరాలు వెల్లడయ్యాయి. గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌ ఆరెంజ్‌ హేజ్‌, వెల్‌వెట్‌ బ్లాక్‌, సెరేన్‌ గ్రీన్ వంటి మూడు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది.

Samsung Galaxy M36 5G smartphone launch date revealed in india

ఎప్పుడు విడుదల కానుంది? :
భారత్‌ మార్కెట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌ జూన్ 27 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది. అమెజాన్ లిస్టింగ్‌ ఆధారంగా ఈ శాంసంగ్‌ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు వెల్లడయ్యాయి.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్ ప్లస్‌ ప్రొటెక్షన్‌ :
శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌ 7.7mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ వెనుక వైపు పిల్‌ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. మరియు నాచ్‌ కటౌట్‌ డిస్‌ప్లేతో లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్ ప్లస్‌ ప్రొటెక్షన్‌ ను పొందుతుంది.

Samsung Galaxy M36 5G smartphone launch date revealed in india

ట్రిపుల్‌ కెమెరాలు :
ఈ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌, 2MP మ్యాక్రో సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను కలిగి ఉంటుంది.

సర్కిల్‌ టూ సెర్చ్‌ :
ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. నైట్‌ పోర్ట్రెయిట్ మరియు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫోటో ఎడిటింగ్‌ టూల్స్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ సర్కిల్‌ టూ సెర్చ్‌, జెమిని లైవ్, ఇన్‌స్టంట్‌ యాక్షన్‌ వంటి ఫీచర్లు ఉంటాయి.

Take a Poll

గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌ చిప్‌సెట్ వివరాలు వెల్లడి కాలేదు. అయితే గీక్‌బెంచ్‌ లిస్టింగ్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ Exynos 1380 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 6GB ర్యామ్‌తో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత UI 7 ను కలిగి ఉంటుంది.

Samsung Galaxy M36 5G smartphone launch date revealed in india

* ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్‌ 6.6 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టాకోర్‌ Exynos 1380 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6 OS ను కలిగి ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 8MP, 2MP కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.13499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ రూ.14999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.17999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M36 5G smartphone launch date revealed in india specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X