రూ.16999 కే శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్.. సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే..?
Samsung Galaxy M36 5G Sale Date : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ నుంచి ఇటీవల గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ 7.7mm థిక్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ AI ఫీచర్లతోపాటు Knox Vault వంటి సెక్యూరిటీ ఫీచర్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ సేల్ జులై 12 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి సేల్ లో భాగంగా ఈ ఫోన్ అన్ని వేరియంట్స్‌పై శాంసంగ్ భారీ డిస్కౌంట్‌లను అందిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై ఈ ఆఫర్‌ను పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ సేల్ తేదీ :
శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999 గా ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో ఈ ఫోన్‌ను రూ.16999 కే కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను బ్యాంకు ఆఫర్లతో రూ.17999 కే కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ ద్వారా కొనుగోలు :
అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను బ్యాంకు ఆఫర్లతో రూ.20999 కే సొంతం చేసుకోవచ్చు. జులై 12 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ను శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ Exynos 1380 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
మూడు కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను కలిగి ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ సర్కిల్ టూ సెర్చ్, AI సెలక్ట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు Edit Suggestions, Image Clipper, Object Eraser వంటి ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ కెమెరాల ద్వారా 4K వీడియోను రికార్డు చేయవచ్చు.


Click it and Unblock the Notifications