Home
Mobile

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ శాంసంగ్‌ ఫోన్‌పై డిస్కౌంట్‌.. అమెజాన్‌లో సేల్‌..!

Samsung Galaxy M36 5G Smartphone : శాంసంగ్‌ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌ గత నెలలో భారత్‌ మార్కెట్‌ లో అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ రేంజ్‌లో భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌ గ్రేడ్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ లో భాగంగా డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. కేవలం నెల వ్యవధిలోనే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫోన్ డిజైన్ సహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పరంగా ఆకట్టుకుంటుంది.

శాంసంగ్‌ ఫోన్‌ ధర వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.21999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. మరియు కూపన్‌ డిస్కౌంట్ ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.

Samsung Galaxy M36 5G Smartphone features

రూ.500 కూపన్‌ డిస్కౌంట్‌ :
అమెజాన్‌ లో (Amazon Great Freedom Festival 2025) 6GB/128GB వేరియంట్ ధర రూ.17499 గా ఉంది. కూపన్ కోడ్‌ ద్వారా రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే 8GB/128GB వేరియంట్‌, 8GB/256GB వేరియంట్‌పై కూడా రూ.500 కూపన్‌ డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

శాంసంగ్‌ ఫోన్‌ డిస్‌ప్లే వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ ప్లస్‌ ప్రొటెక్షన్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఆరెంజ్ హేజ్‌, వెల్‌వెట్‌ బ్లాక్‌, సీరిన్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

Samsung Galaxy M36 5G Smartphone features

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ Exynos 1380 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 తో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను అందిస్తుంది. అంటే ఆరు సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫోన్‌ ను ఉపయోగించుకోవచ్చు.

ట్రిపుల్‌ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ శాంసంగ్ ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలున్నాయి. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 5MP మ్యాక్రో లెన్స్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు ముందు వైపు 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ కెమెరాల ద్వారా 4K వీడియోను రికార్డు చేయవచ్చు.

45W ఫాస్ట్‌ ఛార్జింగ్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ సర్కిల్‌ టూ సెర్చ్‌, AI సెలక్ట్‌ వంటి AI (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు ఎడిటింగ్‌ టూల్స్‌ Object Eraser, Edit Suggestions, Image Clipper కూడా ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M36 5G Smartphone with 6 years of updates get best deals on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X