ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 6 సంవత్సరాల అప్‌డేట్స్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5G ఫోన్.. సేల్ ప్రారంభం!
Samsung Galaxy M36 5G Smartphone Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ గత నెలలో మిడ్ రేంజ్ లో శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం అయింది. ఈ ఫోన్ స్లిమ్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పొందుతుందని శాంసంగ్ వెల్లడించింది.
స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ అమెజాన్‌లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18999 గా ఉంది.

కలర్ వేరియంట్స్ :
ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా ఈ ఫోన్‌ను మరింత డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ ఆరెంజ్ హాజ్, సిరీన్ గ్రీన్, వెల్‌వెట్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7.7mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది.
డిస్‌ప్లే వివరాలు :
ఈ శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే విజన్ బూస్టర్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ రక్షణను పొందుతుంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ Exynos 1380 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది. ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాతో అందుబాటులో ఉంది. నైట్‌ఫోటోగ్రఫీ, AI డెప్త్ మ్యాప్, మల్టీ ఫ్రేమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ కెమెరాల ద్వారా 4K వీడియోను రికార్డు చేయవచ్చు.
ఫాస్ట్ ఛార్జింగ్ :
ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ గూగుల్ జెమిని, సర్కిల్ టూ సెర్చ్ వంటి అనేక AI ఫీచర్లను కలిగి ఉంది. వీటితోపాటు అనేక ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్‌ను కలిగి ఉంది. ఇందులో Object Eraser, Image Clipper, Edit Suggestions వంటి యాప్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications







