Home
Mobile

50MP కెమెరా, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!

Samsung Galaxy M36 5G Smartphone : ప్రముఖ స్మా్ర్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ ఈ సంవత్సరం జూన్‌లో శాంసంగ్‌ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్ స్లిమ్‌ డిజైన్‌తోపాటు అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఫుల్‌ HD+ అమోలెడ్ డిస్‌ప్లే, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌, 50MP OIS కెమెరా వంటి అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఆరెంజ్ హేజ్‌, వెల్‌వెట్‌ బ్లాక్‌, సీరిన్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

విడుదల ధరతో పోలిస్తే గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. అయితే త్వరలో ప్రారంభం కానున్న అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2025 సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను మరింత ధరకు అందుబాటులోకి రానుంది. దీంతోపాటు మరిన్ని శాంసంగ్ మోడల్స్‌ ఈ సేల్‌లో డిస్కౌంట్‌ను పొందనున్నాయి.

samsung galaxy M36 5G smartphone pricedrop

విడుదల సమయంలో ధరలు ఎలా ఉన్నాయ్ :
శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.21999 గా ఉండేది.

రూ.13999 ధరకే :
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.17499 గా ఉంది. ఇటీవల వెల్లడైన సమాచారం ఆధారంగా డిస్కౌంట్లు, బ్యాంకు ఆఫర్లతో ఈ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,999 కే అందుబాటులోకి రానుంది. అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ డేస్‌ 2025 సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్‌ యూజర్లు రేపటి నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు.

ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే :
శాంసంగ్‌ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, విజన్‌ బూస్టర్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ ప్లస్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

samsung galaxy M36 5G smartphone pricedrop

ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ Exynos 1380 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ సర్కిల్‌ టూ సెర్చ్‌, AI సెలక్ట్‌ ఫీచర్లతోపాటు Image Clipper, Object Eraser, Edit Suggestions వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

50MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా (OIS), 12MP అల్ట్రావైడ్‌, 5MP మ్యాక్రో కెమెరాలను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాల ద్వారా 4K వీడియోను రికార్డు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
samsung galaxy M36 5G smartphone with 6 years of updates will get best deal on amazon sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X