Home
Mobile

శాంసంగ్‌ నుంచి త్వరలో గెలాక్సీ M36 స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, లాంచ్‌ వివరాలు..!

Samsung Galaxy M36 Smartphone : శాంసంగ్ నుంచి ఈ సంవత్సరంలో ఎంట్రీ లెవల్, మిడ్‌ రేంజ్‌, ఫ్లాగ్‌షిప్‌ ధరలో అనేక మోడల్స్‌ను లాంచ్‌ చేసింద. గత వారంలో శాంసంగ్‌ గెలాక్సీ S25 ఎడ్జ్‌ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే త్వరలో మరో హ్యాండ్‌సెట్‌ను లాంచ్‌ చేయనుంది. శాంసంగ్‌ గెలాక్సీ M36 5G పేరుతో ఈ ఫోన్‌ విడుదల కానుంది. ఏప్రిల్‌ నెలలోనే ఈ ఫోన్‌ గీక్‌బెంచ్‌ సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది.

అయితే తాజాగా శాంసంగ్‌ గెలాక్సీ M36 స్మార్ట్‌ఫోన్‌.. సంస్థ అధికారిక సపోర్టు పేజీలో కనిపించింది. SM-M366B/DS మోడల్ నంబర్‌తో కనిపించింది. శాంసంగ్‌ సపోర్టు పేజీ ఆధారంగా ఈ ఫోన్ లాంచ్‌, స్పెసిఫికేషల వివరాలు వెల్లడి కాలేదు. అయితే గీక్‌బెంచ్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కొన్ని వివరాలు వెల్లడయ్యాయి.

Samsung galaxy M36 Smartphone spotted on Samsung support page and expected to launch soon in india

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా గెలాక్సీ M36 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గీక్‌బెంచ్‌ లిస్టింగ్‌ ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. గత సంవత్సరం లాంచ్‌ అయిన గెలాక్సీ M35 హ్యాండ్‌సెట్ Exynos చిప్‌సెట్‌ను కలిగి ఉంది. అయితే చిప్‌సెట్ పరంగా గుర్తించదగిన మార్పుగా పరిగణించాలి.

గీక్‌బెంచ్‌ లిస్టింగ్‌ ఆధారంగా :
దీంతోపాటు గీక్‌బెంచ్‌ లిస్టింగ్‌ ఆధారంగా గెలాక్సీ M36 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 Skin పైన పనిచేస్తుంది. అయితే ఈ ఫోన్ 1004 సింగిల్‌ కోర్‌, 2886 మల్టీ కోర్‌ స్కోర్‌ను కలిగి ఉంది. అయితే ఈ లిస్టింగ్‌లో 6GB వేరియంట్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది.

స్సెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల అంచనా వివరాలు :
స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తోపాటు గ్రాఫిక్స్‌ టాస్క్‌ల కోసం Arm Mali G68 GPU ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌ 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతోపాటు ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌తోపాటు 1900 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ట్రిపుల్‌ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ గెలాక్సీ M36 స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్‌, 5MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 12MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్‌ స్టాండర్డ్‌) మరియు బ్లూటూత్‌ SIG సర్టిఫికేషన్‌ పేజీల్లో కనిపించింది. అంటే భారత్‌లో త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే కచ్చితమైన లాంచ్ వివరాలు తెలియాల్సి ఉంది. శాంసంగ్‌ గెలాక్సీ M35 స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం మే నెలలో లాంచ్‌ అయింది. దీని ఆధారంగా గెలాక్సీ M36 స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

* ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాంసంగ్‌ గెలాక్సీ M35 స్మార్ట్‌ఫోన్‌ 6.6 అంగుళాల ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఆక్టాకోర్‌ Exynos 1380 చిప్‌సెట్‌, గ్రాఫిక్స్‌ టాస్క్‌ల కోసం Mali G68 MP5 GPU ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6 OS పైన పనిచేస్తోంది.

కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 8MP, 2MP కెమెరాలను కలిగి ఉంది. మరియు 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.13499 కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15,499, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.18,499 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy M36 Smartphone spotted on Samsung support page and expected to launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X