7000mAh బ్యాటరీతో శామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ Galaxy M51 ఫీచర్స్ ఇవే...
దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం శామ్‌సంగ్ కంపెని ఇండియాలో త్వరలోనే ఒక స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయనున్నది. గెలాక్సీ M51 పేరుతో రాబోతున్న ఈ హ్యాండ్‌సెట్ యొక్క ఖచ్చితమైన లాంచ్ డేట్ ఇంకా నిర్ధారించబడనప్పటికీ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. గెలాక్సీ M51 7000mAh బ్యాటరీ సామర్ధ్యంతో వస్తున్న మొట్టమొదటి శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కావడం మరొక గొప్ప విషయం. గెలాక్సీ M51 ఫోన్ ఇండియాలో పండుగ సీజన్‌కు ముందు సెప్టెంబర్ ఆరంభంలో రూ.25 వేల నుంచి రూ.30,000 ధరల మధ్య లాంచ్ కానున్నట్లు సమాచారం.

గెలాక్సీ M51 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
ఇండియాలో గత సంవత్సరంలో శామ్సంగ్ అనేక గెలాక్సీ Mసిరీస్ స్మార్ట్‌ఫోన్లలో 6000mAh బ్యాటరీ ఫీచర్లను తీసుకువచ్చింది. ఇప్పుడు ఇది గెలాక్సీ M51 తో మరొక అడుగు ముందుకు వేస్తోంది. అంతేకాకుండా ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. గెలాక్సీ M51 యొక్క ఇతర ముఖ్యమైన ఫీచర్లలో స్నాప్‌డ్రాగన్ 730G SoC, 64MP క్వాడ్-కెమెరా సెటప్ మరియు 6.67-అంగుళాల ఫుల్ HD + సూపర్ అమోలెడ్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గెలాక్సీ M51 స్మార్ట్‌ఫోన్ 7000mAh బ్యాటరీ
లీక్ అయిన సమాచారం ప్రకారం గెలాక్సీ M51 స్మార్ట్‌ఫోన్ 1080 × 2340 పిక్సెల్స్ పరిమాణంతో 6.67-అంగుళాల రిజల్యూషన్ తో ఫుల్ HD + సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 730G SoC చిప్ సెట్ ను కలిగి ఉండి 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. గెలాక్సీ M51 యొక్క హైలైట్ విషయం ఏమిటంటే ఇది 7000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి రావడం. ఇందులో మరొక గమ్మత్తు విషయం ఏమిటంటే ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతును కలిగి ఉండడం. అదనంగా ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంది.

గెలాక్సీ M51 స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్
గెలాక్సీ M51 స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్ విషయానికొస్తే గెలాక్సీ M51 ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 64MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్ కెమెరా, 5MP డెప్త్ సెన్సార్ మరియు 5MP మాక్రో సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. అలాగే ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్ కెమెరా కూడా ఉండవచ్చు అని పుకారులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications







