Home
Mobile

50MP సెల్ఫీ కెమెరాతో శాంసంగ్‌ M సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. సూపర్‌ అమోలెడ్‌ ప్లస్‌ డిస్‌ప్లే సహా..!!

శాంసంగ్‌ సంస్థ తాజాగా భారత్‌ మార్కెట్‌లో తన M సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. ఇవాళ శాంసంగ్‌ గెలాక్సీ M55 5G (Samsung Galaxy M55 5G) మరియు గెలాక్సీ M15 5G (Samsung Galaxy M15 5G smartphone) హ్యాండ్‌సెట్‌లు విడుదల అ‌య్యాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి.

శాంసంగ్‌ గెలాక్సీ M55 5G స్పెసిఫికేషన్లు
శాంసంగ్‌ గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ ప్లస్‌ ఇన్ఫినిటి-O డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యా్న్ని కలిగి ఉంటుంది.

samsung galaxy m55 5g and galaxy m15 5g smartphones price

ఈ గెలాక్సీ M55 5G హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OneUI 6.1 పైన పనిచేస్తుంది. మరియు అండర్ ది హుడ్‌ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ చిప్‌ అడెన్నో 644 GPU తో జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది.

గెలాక్సీ M55 5G హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ సెన్సార్‌, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

samsung galaxy m55 5g and galaxy m15 5g smartphones price

128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది. 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ ధర రూ.29,999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ రూ.32,999 గా ఉంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపును పొందవచ్చు. లైట్‌ గ్రీన్‌, డార్క్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు : శాంసంగ్‌ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్‌ 1080*2340 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.5 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌, మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6 పైన పనిచేస్తుంది.

గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్‌ +128GB స్టోరేజీ, 6GB ర్యామ్‌ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పొడిగించుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 4 సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను పొందనుంది.

6000mAh బ్యాటరీ : ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌ 25W వైరడ్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌ 4GB ర్యామ్‌ ధర రూ.13,999 గా ఉంది. అదే 6GB ర్యామ్ రూ.14,799 గా ఉంది. HDFC బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు రూ.1699 విలువైన ఛార్జర్‌ను ఉచితంగా పొందవచ్చు. అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung galaxy m55 5g and galaxy m15 5g smartphones launched in india with key specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X