6.7 అంగుళాల HD డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరాలతో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు,,!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ఇటీవల కాలంలో అన్ని ధరల సెగ్మెంట్‌లలో కొత్త హ్యాండ్‌సెట్‌లను విడుదల చేస్తోంది. శాంసంగ్ ఇటీవల గెలాక్సీ A55 5G మరియు A35 5G స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసింది. తాజాగా ఈ సంస్థ నుంచి మరో ఫోన్ M55 5G (Samsung Galaxy M55 5G) విడుదల కానుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ వివరాలు ఇటీవల కొన్ని లీక్ అయ్యాయి.
శాంసంగ్ గెలాక్సీ M55 5G స్పెసిఫికేషన్లు :
ఇప్పటి వరకు వచ్చిన కొన్ని లీక్‌ల ఆధారంగా ఈ గెలాక్సీ M55 5G హ్యాండ్ సెట్ 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు సన్నిని బెజెల్స్‌తో వస్తుందని తెలుస్తోంది. 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ట్రిపుల్ కెమెరాలు :
ఈ హ్యాండ్ సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 50MP ప్రైమరీ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ M55 5G స్మార్ట్ ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్ సెట్ 12GB ర్యామ్ మరియు గరిష్ఠంగా 256GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ శాంసంగ్ నుంచి త్వరలో లాంచ్ కానున్న హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI ఇంటర్‌ఫేస్ పైన పనిచేస్తుందని సమాచారం.
ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు :
ఈ శాంసంగ్ గెలాక్సీ M55 5G స్మార్ట్ ఫోన్.. ఐదు OS అప్‌డేట్లను పొందుతుందని, మరియు 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు పొందుతుందని శాంసంగ్ వెల్లడించింది. అయితే ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై శాంసంగ్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఈ ఫోన్ త్వరలో ఫోన్ విడుదల కానుందని తెలిసినా.. సరైన తేదీ వెల్లడి కాలేదు.
దీంతోపాటు గెలాక్సీ M55 5G స్మార్ట్ ఫోన్ సహా గెలాక్సీ F55 5G హ్యాండ్ సెట్ కూడా త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ హ్యాండ్ సెట్ బ్లూటూత్ SIG సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీంతోపాటు భారత్ సహా కొన్ని దేశాల్లో ఈ ఫోన్‌ల లైవ్ పేజీ ప్రారంభం అయింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








