Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 12GB ర్యామ్‌తో Samsung ఫోన్‌ టీజర్‌ విడుదల.. స్పెసిఫికేషన్లు, లాంచ్‌ వివరాలు..!

శాంసంగ్‌ నుంచి త్వరలో భారత్‌ మార్కెట్‌లోకి శాంసంగ్‌ గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy M55 5G Smartphone) విడుదల కానుంది. శాంసంగ్‌ ప్రకటన చేసింది. కొన్ని రోజుల క్రితం బ్రెజిల్‌లో ఫోన్ లాంచ్‌ అయింది. అయితే ఈ ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో విడుదలకు ముందే కొన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీక్‌ అయ్యాయి.

భారత్‌లో గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి సంస్థ టీజర్ (Samsung Galaxy M55 5G Teased) విడుదల చేసింది. త్వరలోనే విడుదల కానుందని పోస్టులో పేర్కొంది. అయితే M55 5G మోడల్‌తోపాటు M15 5G కూడా లాంచ్‌ కానుందని తెలుస్తోంది. అమెజాన్‌ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

Samsung Galaxy M55 5G Smartphone teased

మూడు స్టోరేజీ వేరియంట్లు :
టిప్‌స్టర్‌ సుదన్సు అంబోర్‌ ఈ గెలాక్సీ M55 5G, గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలను వెల్లడించారు. దీని ఆధారంగా గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో లభిస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు M15 5G హ్యాండ్‌సెట్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 మరియు 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.29,999, 12GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.32,999 గా ఉంది.

టిప్‌స్టర్‌ వివరాల ఆధారంగా ఈ శాంసంగ్‌ గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ ప్లస్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 1 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 పైన పనిచేస్తుందని తెలుస్తోంది.

50MP సెల్ఫీ కెమెరా :
దీంతోపాటు 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Samsung Galaxy M55 5G Smartphone teased

లీక్‌ అయిన వివరాలు ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ M15 5G హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.13499 అదే 6GB ర్యామ్‌ +128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.14,999 గా ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M55 5G Smartphone teaser launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X