50MP సెల్ఫీ కెమెరాతో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ ఖరారు.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
శాంసంగ్ గెలాక్సీ M55 5G (Samsung Galaxy M55 5G Smartphone) మరియు M15 5G స్మార్ట్ ఫోన్ భారత్ విడుదల ఖరారు అయింది. ఈ రెండు హ్యాండ్ సెట్‌లు ఏప్రిల్ 8న విడుదల కానున్నాయి. అయితే ఈ ఫోన్ల స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి. దీంతోపాటు శాంసంగ్ కూడా ఈ కొత్త గెలాక్సీ హ్యాండ్ సెట్‌ల వివరాలను వెల్లడించింది.
శాంసంగ్ గెలాక్సీ M55 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ M55 5G స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. విజన్ బూస్టర్ టెక్నాలజీతో లాంచ్ కానుంది. మరియు మెరుగైన విజువల్ అనుభూతిని కలిగిస్తుంది.

45W ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్టుతో :
ఈ స్మార్ట్ ఫోన్ 4nm స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 CPU ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్ సెట్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్ సెట్ 45W ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తక్కువ సమయంలో ఛార్జింగ్ చేయవచ్చని తెలుస్తోంది.
50MP సెల్ఫీ కెమెరా : ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలను కలిగి ఉంటుంది. అదే ముందువైపు సెల్ఫీ, వీడియోల కోసం 50MP హై రిజల్యూషన్ కెమెరాను కలిగి ఉంటుంది. మెరుగైన ఫోటోలు, వీడియోలు క్యాప్చర్ చేయవచ్చు. నైట్ ఫోటోగ్రఫీ ఫీచర్‌తో విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ డెనిమ్ బ్లాక్, లైట్ గ్రీన్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ M15 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్ ఫోన్ (Samsung Galaxy M15 5G Smartphone) 6.5 అంగుళాల సూపర్ అమోలెడ్ పుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్ సెట్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా ఈ గెలాక్సీ M15 5G స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ 50MP కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్ సెట్ బ్లూ తపజ్, స్టోన్ గ్రే, సిలిస్టైన్ బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఏప్రిల్ 8న భారత్ మార్కెట్‌లో విడుదల కానున్నాయి. మరిన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు త్వరలోనే విడుదల కానున్నాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








